పాక్ తో అణు సంబంధాలు కొనసాగుతాయి -చైనా

ఎవరేమనుకున్నా పాకిస్ధాన్ తో తమ అణు వాణిజ్య సంబంధాలు కొనసాగుతాయని చైనా స్పష్టం చేసింది. అంతర్జాతీయ నియమ నిబంధనలకు కట్టుబడే తాము పాకిస్ధాన్ కు అణు రియాక్టర్లు సరఫరా చేస్తున్నామని ‘న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‘ (ఎన్.ఎస్.జి) నిబంధనలు కూడా తాము అతిక్రమించడం లేదని చైనా తెలిపింది. కనీసం రెండు కొత్త అణు రియాక్టర్ల నిర్మాణానికి చైనా సహకరిస్తోందని, ఇది అంతర్జాతీయ నియమాలకు విరుద్ధమని ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో చైనా తన అణు వ్యాపారాన్ని గట్టిగా సమర్థించుకుంది. ఎన్.ఎస్.జి…

అమెరికాకు పాకిస్ధాన్ “తలాక్! తలాక్!! తలాక్!!!” చెప్పనున్నదా?

జరుగుతున్న పరిణామాలు అమెరికా పట్టునుండి పాకిస్ధాన్ జారిపోనున్నదా అన్న అనుమాలు కలగజేస్తున్నాయి. పాకిస్ధాన్ నుండి అమెరికా మనుషుల (ప్రత్యేక భద్రతా బలగాలు లేదా సి.ఐ.ఏ గూఢచారులు) సంఖ్యను సగానికి తగ్గించాల్సిందిగా పాకిస్ధాన్ మిలట్రీ అమెరికాను డిమాండ్ చేసింది. పాకిస్ధాన్ మిలట్రీ కోరిక మేరకు తమ పాకిస్ధాన్ నుండి తమ మనుషులను వెనక్కి పిలిపిస్తున్నామని అమెరికా కూడా ప్రకటించింది. “అనవసరమైన మనుషులు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాకు సాయం చేయడానికి బదులు మరిన్ని సమస్యలు సృష్టిస్తున్నారు”…