శ్రీలంక సంక్షోభం, సాయం చేసేందుకు ఇండియా చైనా పోటీ

శ్రీలంక ఇటీవల కాలంలో ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. సంక్షోభం నుండి గట్టెక్కేందుకు శ్రీలంక బహిరంగంగానే ఇండియా సహాయం కోరింది. ఆ మేరకు ఇండియా కూడా గత నవంబరులో కొన్ని హామీలు ఇచ్చింది. ప్రమాదం గ్రహించిన చైనా తానూ సహాయం చేస్తానంటూ ముందుకు వస్తోంది. జనవరి మొదటి వారంలో చైనా విదేశీ మంత్రి శ్రీలంక పర్యటించనున్నారు. జనవరి 7 తేదీ గానీ లేదా 9 తేదీ గానీ ఈ పర్యటన జరగనున్నట్లు తెలుస్తున్నది. ఈ పర్యటనలో శ్రీలంకకు నోరూరించే…

చైనా సరిహద్దుకు 100 ట్యాంకులు తరలింపు! 

దారిన పోయే దరిద్రాన్ని పిలిచి తలకెత్తుకోవటం అంటే ఇదే కావచ్చు. NSG (న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్) సభ్యత్వం కోసం ఎన్నడూ లేని విధంగా బీజింగ్ చుట్టూ చక్కర్లు కొట్టిన ప్రధాన మంత్రి ఇప్పుడు సరిహద్దు వద్ద ఉద్రిక్తత పెరిగేందుకు దోహదం చేస్తూ చైనాతో ఘర్షణ వాతావరణం పెంచే విధంగా గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు. వివాదాస్పద సరిహద్దు కలిగిన లడఖ్ ఏరియా లోకి భారీ ఎత్తున యుద్ధ ట్యాంకులను  భారత ప్రభుత్వం తరలించింది. జమ్మూ & కాశ్మీర్, టిబెట్ ప్రాంతాల…