చైనా సరిహద్దులో భద్రత తగ్గింపు

యు.పి.ఏ ప్రభుత్వం హయాంలో చైనా చొరబాట్ల గురించి బి.జె.పి చేసిన యాగీ అంతా ఇంతా కాదు. ప్రధాని నరేంద్ర మోడి గారయితే చైనా విషయంలో యు.పి.ఏ పై నిప్పులు చెరిగేవారు. హిందూత్వ అభిమానగణం గురించి ఇక చెప్పనే అవసరం లేదు. హిందూత్వపై విమర్శలు కనపడిన చోటల్లా చొరబడి చైనా అది చేయడం లేదా, ఇది చేయడం లేదా అని దాడికి దిగుతారు. కొండొకచో బూతులకు లంకించుకుంటారు. తీరా మోడి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కూడా, చైనా…

మా వ్యతిరేక కూటమిలో ఇండియా చేరదు -చైనా

భారత ప్రధాని నరేంద్ర మోడి అమెరికా పర్యటన ముగిసిన నేపధ్యంలో పర్యటన అనంతర పరిస్ధితిని చైనా ప్రభుత్వ అధికార పత్రిక పీపుల్స్ డెయిలీ సమీక్షించింది. అమెరికా తన నేతృత్వంలో తలపెట్టిన చైనా వ్యతిరేక కూటమిలో ఇండియా చేరే అవకాశం లేదని మోడి అమెరికా పర్యటన ద్వారా గ్రహించవచ్చని పత్రిక పేర్కొంది. తమ అవగాహనకు కారణాలను పత్రిక వివరించింది. భారత విదేశీ విధానం పునాదులు అలీన ఉద్యమంలో ఉన్నందున ప్రపంచ ధృవ పోటీల్లో ఇండియా ఒక పక్షం వహించబోదని…

వాయు బంధంతో రష్యా చైనాలు ఇంకా దగ్గరికి

బ్రిక్స్ కూటమిలో భాగస్వాములయిన రష్యా చైనా దేశాల మధ్య స్నేహ సంబంధాలు పరవళ్ళు తొక్కుతున్నాయి. అతి పెద్ద ఎనర్జీ మార్కెట్ గా చైనా శరవేగంగా అవతరిస్తున్న నేపధ్యంలో ప్రపంచంలోనే అతి పెద్ద సహజవాయువు ఉత్పత్తిదారయిన రష్యాకు భారీ మార్కెట్ అందుబాటులోకి వస్తోంది. ఈ మార్కెట్ ను సొమ్ము చేసుకునే ప్రక్రియలో భాగంగా ఇరు దేశాల మధ్యా భారీ వాణిజ్య ఒప్పందం కుదిరింది. రానున్న 7 సంవత్సరాల్లో 100 బిలియన్ డాలర్ల (10 వేల కోట్లు) చమురు, సహజవాయువును…

ఇండియా-చైనా యుద్ధం: మిలట్రీ చర్యపై ముందే హెచ్చరించిన చైనా

ఈ అక్టోబర్ 20 తేదీతో చైనా-ఇండియాల యుద్ధం ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగిన సరిహద్దు ఘర్షణలపై పత్రికలు తాజా విశ్లేషణలకు పూనుకుంటున్నాయి. టి.వి చానెళ్లు ప్రత్యేక కధనాలు ప్రసారం చేస్తున్నాయి. చైనా ముందస్తు హెచ్చరిక లేకుండా ఇండియాపై దాడి చేసిందన్నది ఈ విశ్లేషణలు, ప్రత్యేక కధనాల సారాంశంగా ఉన్నది. అప్పటి చైనా కమ్యూనిస్టు పార్టీ ఛైర్మన్ మావో జెడాంగ్ ఆదేశాలతోనే చైనా ఇండియాపై దురహంకార దాడికి దిగిందని నిన్న…

భారత రాయబారిపై చైనా వ్యాపారుల దాడి? ఏది నిజం?

  భారత రాయబారి ఎస్.బాలచంద్రన్ పైన చైనా వ్యాపారులు దాడి చేశారనడాన్ని షాంఘైలోని భారత రాయబార కార్యాలయ అధికారులు నిరాకరిస్తున్నట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. కాని సంఘటనను వివరిస్తున్న భారత పత్రికల కధనాలు వేరే విధంగా ఉన్నాయి. దాడి జరిగిందని చెప్పలేనప్పటికీ, దాడిలాంటిది జరిగిందని మాత్రం అర్ధం అవుతోంది. ఇందుకు ప్రధానంగా చైనా వ్యాపారుల తొందరపాటుతనం కారణంగా కనిపిస్తోంది. తమకు ఇవ్వవలసిన డబ్బులను రాబట్టుకునే ప్రయత్నంలో వారు తొందరబాటుకి గురైనట్లు కనిపిస్తోంది. షాంఘై నగరం దగ్గర…

భారత రాయబారికి వైద్యం నిరాకరించడంపై విచారణకు చైనా అంగీకారం

తన రాయబారికి వైద్యం నిరాకరించడం విషయంలో భారత విదేశీ మంత్రిత్వ శాఖ చేసిన ఫిర్యాదుపై విచారణ జరపడానికి చైనా అంగీకారం తెలిపింది. భారత వ్యాపారులను విచారిస్తున్న కోర్టు వద్ద హాజరైన రాయబారికి కోర్టులో ఉండగా వైద్య సౌకర్యం పొందడానికి అక్కడ ఉన్న చైనా అధికారులు నిరాకరించారని భారత విదేశీ మంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేసింది. షాంఘైలోని భారత రాయబార కార్యాలయ అధికారి ఎస్.బాలచంద్రన్ డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. ‘యివు’ పట్టణంలో అక్రమ వ్యాపారం చేస్తున్నారన్న అనుమానంతో భారత…