చెల్లింపుల సమతూకం (BoP) అంటే… -ఈనాడు

ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధ ఫండమెంటల్స్ లో చెల్లింపుల సమతూకం (Balance of Payments) ఒక ముఖ్యమైన అంశం. ఒక దేశం తన అవసరాల రీత్యా (ఉదా: దిగుమతులు) విదేశాలకు చెల్లింపులు చేయగల స్ధితిలో ఉన్నదా లేదా అన్నది ఆ దేశ BoP తెలియజేస్తుంది. పేరులో ఉన్నట్లు BoP అంటే చెల్లింపులు చేయడం కాదు. అది ఒక ఆర్థిక ప్రకటన. ఒక కంపెనీ ఆర్ధిక పరిస్ధితిని ఆ కంపెనీ యేటా ప్రకటించే బ్యాలన్స్ షీట్ తెలియజేసినట్లే ఒక…

డాలర్ నిల్వలకు ఎసరు తెస్తున్న ధనికుల బంగారం దాహం

భారత దేశ ధనికులు బంగారం పైన పెంచుకుంటున్న వ్యామోహం మన విదేశీ మారక ద్రవ్య నిల్వలకు ఎసరు తెస్తోంది. దేశంలోకి వస్తున్న విదేశీ మారక ద్రవ్యం కంటే బంగారం, చమురుల కొనుగోళ్ల కోసం దేశం బైటికి వెళుతున్న విదేశీ మారక ద్రవ్యమే ఎక్కువ కావడంతో నిల్వలు తరిగిపోతున్నాయి. ఫలితంగా భారత ఆర్ధిక వ్యవస్థకు కరెంటు ఖాతా లోటు (Current Account Deficit –CAD) రికార్డు స్థాయికి చేరుకుంది. ఒక దేశ ఆర్ధిక వ్యవస్థ మౌలిక ప్రమాణాలలో (ఫండమెంటల్స్)…

రూపాయి విలువ పడిపోవడానికి యూరోపే కారణం -ఆర్ధిక మంత్రి

గత కొద్ది నెలలుగా రూపాయి విలువ 15 శాతం పైగా పడిపోవడానికి కారణం యూరో జోన్ లోని వ్యవస్ధాగత సమస్యలేనని ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తేల్చేశాడు. రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పతనం అవుతుండడంతో దేశ దిగుమతుల బిల్లు తడిసి మోపెడయింది. యూరోజోన్ ఋణ సంక్షోభంతో పాటు కమోడీటీల ధరలు, ముఖ్యంగా ఆయిల్ ధరలు అస్ధిరంగా మారడంతో ఇండియాతో పాటు ఇతర ఆసియా దేశాల్లో ‘చెల్లింపుల సమతూకం’ (Balance of Payment) ఒత్తిడికి గురవుతోందని ప్రణబ్…

తగ్గిపోతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు – ప్రజల్ని పట్టించుకోని ప్రభుత్వ ఆర్ధిక సర్వే

  2011-12 ఆర్ధిక సంవత్సరానికి నూతన బడ్జెట్ రూపొందించడంలో భాగంగా భారత ప్రభుత్వం శుక్ర వారం ఆర్ధిక సర్వే వివరాలను వెల్లడించింది. కొత్త బడ్జెట్ ప్రకటించటానికి రెండు మూడు రోజుల ముందు ఆర్ధిక సర్వే ఫలితాలను ప్రకటిస్తారు. ఈ సర్వేలు సాధారణంగా పారిశ్రామిక ఉత్పత్తి, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, జి.డి.పి పెరుగుదల, కరెంట్ ఎకౌంట్, ఎగుమతులు దిగుమతులు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ (చెల్లింపుల సమతూకం) మొదలైన వాటి ప్రస్తుత పరిస్ధితి వాటి మెరుగుదలకు తీసుకోవలసిన చర్యల పట్ల…