చెన్నై: స్వాతి హంతకుడు దొరికాడు
వారం రోజులుగా చెన్నై పోలీసులకు ‘కొరకరాని కొయ్య’గా మారిన చెన్నై టెకీ స్వాతి హత్య మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. తాను పని చేసే ఇన్ఫోసిస్ కంపెనీకి వెళ్ళేందుకు నుంగంబక్కం రైల్వే స్టేషన్ లో ఎదురు చూస్తున్న స్వాతిని కొడవలితో నరికి చంపిన హంతకుడి ఆచూకీని ప్రజల సాయంతో పోలీసులు పట్టుకోగలిగారు. తమిళనాడులో వరుసగా జరుగుతున్న హత్యల నేపధ్యంలో పోలీసుల పైనా, ప్రభుత్వం పైనా తీవ్ర విమర్శలు వచ్చిన నేపధ్యంలో చెన్నై పోలీసులు భారీ ఎత్తున బలగాలను…