చెన్నై టీం ఓనర్లే స్పాట్ ఫిక్సర్లు, పందెందార్లు

కలుగులో ఎలుక బైటికి వచ్చేస్తోంది. పోలీసులు పెట్టిన పొగ తట్టుకోలేక పుట్టలో పాములు వరుసగా తోసుకుని బైటికొస్తున్నాయి. విందూ దారా సింగ్ ఇచ్చిన వివరాలు నిజమేనని ముంబై పోలీసులకు స్పష్టంగా అర్ధం అయింది. స్పాట్ ఫిక్సింగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ యజమాని, బి.సి.సి.ఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు, ఇండియా సిమెంట్స్ కంపెనీ అధినేతల్లో ఒకరు అయిన గురునాధ్ మీయప్పన్ పాత్ర ఉన్నదని ముంబై పోలీసుల వద్ద సరిపోయినన్ని సాక్ష్యాలు ఉన్నాయట. ఈ మేరకు ముంబై జాయింట్…

ఐ.పి.ఎల్ మాయల బూరోడు -కార్టూన్

పైడ్ పైపర్ అనేది జర్మనీలో బహుళ ప్రచారంలో ఉన్న ఒక కధ. ఓ చిన్న నగరానికి ఎలుకలు పెద్ద బెడదగా ఉండేవిట. వాటిని వదిలించుకోడానికి నగర జనం, అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. ఒకసారి బూర (పైపర్) ఊదుకుంటూ రంగు రంగుల దుస్తులు ధరించిన ఒక వ్యక్తి ఆ నగరానికి వచ్చాడు. ఎలుకలను తాను తరిమేస్తానని, అందుకు తనకు తగిన ఫలితం ఇవ్వాలని కోరాడాయన. ప్రజలు, మేయర్ చర్చించుకుని పెద్ద మొత్తం ఇవ్వడానికి సరేనన్నారు.…