‘చీపురుతో మోడి’ ఫోటో ఫేక్ –ఆర్‌టి‌ఐ చట్టం

సమాచార హక్కు చట్టం బి‌జే‌పి కొంపకు చిన్న చిచ్చు పెట్టింది. ప్రధాని నరేంద్ర మోడి ఎంతో పేదవాడు అంటూ 2014 సాధారణ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు బి‌జే‌పి శ్రేణులు, నాయకులు ఉపయోగపెట్టిన ఫోటో అసలుది కాదని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిసి వచ్చింది. నరేంద్ర మోడి క్రమ శిక్షణ కలిగిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త అనీ, ఆయన పేదరికంలో పుట్టి పెరిగారని, ఇతర వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తి అని ఎన్నికల ప్రచారంలో…

చెన్నై వరదలు: ఇదీ అమ్మ సాయం! -కార్టూన్

తమిళనాట వ్యక్తి పూజ జాస్తి. అభిమాన నటుడికి గుడి కట్టి పూజించేవరకూ ‘వ్యక్తి పూజ’ వెళ్తుందని తమిళులు ఇప్పటికే అనేక తడవలు చాటుకున్నారు. ‘అమ్మ పూజ’ ఇప్పుడు అన్ని పాత రికార్డులను దాటుకుని విపరీత స్దాయికి చేరుకుందని ఇటీవలి పరిణామాలు చెబుతున్నాయి. ‘అమ్మ పూజ’ ఎంత వికృత స్ధాయికి చేరిందో చెన్నై వరదలు వెల్లడి చేశాయి. ‘అమ్మ’కి జైలు శిక్ష పడినప్పుడు తాత్కాలిక ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమ్ సహా మంత్రివర్గం మొత్తం టి.వి కెమెరాల ముందు కుమిలి…

చెన్నై: వాన గ్రహణం -కార్టూన్

“కార్టూన్ పొలికేక వేసినట్లు ఉండకూడదు. రణగొణ ధ్వనులతో అస్పష్టంగా కూడా ఉండకూడదు. నిశ్శబ్దంగా, సూటిగా, స్పష్టంగా ఉండాలి” అని ది హిందూ కార్టూనిస్టు కేశవ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అందుకే కేశవ్ కార్టూన్స్ లో పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు ఉండవు. పొడవైన డైలాగ్స్ చాలా చాలా తక్కువ కనిపిస్తాయి. ఒక హెడ్డింగ్, ఒక శీర్షిక, ఒక సామెత, ఒక వాడుక, ఒక సార్వజనీన వాస్తవం… ఇవి మాత్రమే కనిపిస్తాయి. కాకుంటే చెన్నైను కనీవినీ ఎరుగని రీతిలో ముంచెత్తిన…

చెన్నై జల విలయం -ఫోటోలు

జల విలయం అన్నది చిన్నమాట కావచ్చు. ఏకంగా ఫ్లై ఓవర్ రోడ్లే నిండా మునిగిపోయే వర్షం! ది హిందు ప్రకారం మునిగిపోయిన రోడ్ల సంఖ్య 6,857. 84 గంటల నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకి తడవని వాడు వెధవ కిందే లెక్క! వంద యేళ్ళ తర్వాత ఈ స్ధాయిలో కురిసిన వర్షాన్ని కనీసం స్పర్శతోనన్నా అనుభవించనివాడు వెధవ కాక మరెవ్వరూ? నీటి కొరతతో సంవత్సరం పొడవునా అల్లాడుతూ గడిపే చెన్నై నగరాన్ని రాక రాక వచ్చి పలకరించిన…