తలతిక్కవాదంతో ఎఫ్.డి.ఐ బిల్లుని గెలిపించిన ఎస్.పి, బి.ఎస్.పి

చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకి వ్యతిరేకంగా బి.జె.పి ప్రవేశపెట్టిన తీర్మానం లోక్ సభలో ఓడిపోయింది. బిల్లుకి వ్యతిరేకం అని చెబుతూనే సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు సభనుండి వాకౌట్ చేయడంతో బిల్లు 253-218 ఓట్లతో నెగ్గింది. వాకౌట్ చెయ్యడం ద్వారా తాము కూడా ఆ తానులోని ముక్కలమేనని ఎస్.పి, బి.ఎస్.పిలు నిర్ద్వంద్వంగా చాటుకున్నాయి. బి.సిలను ఉద్దరించడానికి ఉద్భవించామని ఎస్.పి, దళితుల ఉద్ధరణే ఏకైక లక్ష్యమని…

ఒకే వేదికపై బి.జె.పి, లెఫ్ట్ పార్టీలు

బి.జె.పి, లెఫ్ట్ పార్టీల నాయకులు ఢిల్లీలో కలకలం సృష్టించారు. చిల్లర వర్తకంలో 51 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించినందుకు నిరసనగా ప్రతిపక్షాలు తలపెట్టిన బంద్ సందర్భంగా ఉప్పు, నిప్పుగా ఉండవలసినవారు ఒకే వేదికపైకి చేరారు. వ్యాపారులు నిర్వహించిన నిరసన సభలో బి.జె.పి, లెఫ్ట్ పార్టీల అగ్రనాయకులు ఆసీనులై పత్రికల, విశ్లేషకుల ఊహాగానాలకు పని పెట్టారు. ఇది దేశ రాజకీయాల్లో పెను మార్పులు తెచ్చే పరిణామం కాకపోయినప్పటికీ వామపక్ష పార్టీల ప్రకటిత విధానాలు తెలిసినవారు భృకుటి ముడివేసే పరిణామమే.…

చిల్లర దుకాణాల్లో విదేశీ పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం, విపక్షాల నటనాగ్రహం

ప్రపంచ వ్యాపితంగా వ్యాపారాలు చేస్తున్న అతి పెద్ద చిల్లర సరుకుల అమ్మకం దారులు (రిటైల్ అమ్మకాలు సాగించే సూపర్ మార్కెట్లు) వాల్ మార్డ్, కేరేఫర్, టెస్కో లాంటి కంపెనీలను భారత దేశంలోకి అనుమతించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయం కోసం అనేక సంవత్సరాలుగా పశ్చిమ దేశాలు భారత దేశంపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి. భారత దేశ దళారీ పాలకులు, దళారి కంపెనీల తృప్తికి సరిపడా బేరాలు కుదరలేదేమో, ఇన్నాళ్ళూ అది కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు…

చిల్లర దుకాణాల కడుపు కొట్టడానికి సర్వం సిద్ధం

చిన్నపాటి రిటైల్ దుకాణదారుల కడుపు పైన కొట్టడానికి కేంద్ర ప్రభుత్వం అంతా సిద్దం చేసుకుంటోంది. భారత దేశ వ్యాపితంగా పల్లెల్లో, పట్నాల్లో ప్రతి వీధి చివరా, సెంటర్లలో రోజూ మనకు కనిపించే రిటైల్ దుకాణాలు రానున్న రోజుల్లో కనిపించక పోవచ్చు. కొన్ని కోట్లమంది దుకాణదారులు, వారి కుటుంబాలను రోడ్డున పడేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇంతవరకూ మల్టిబ్రాండ్ రిటైల్ రంగంలోకి విదేశీ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు. కేవలం సింగిల్ బ్రాండ్ లోనే విదేశీ పెట్టుబడులను…