ఇరాక్ యుద్ధం చట్ట విరుద్ధం -యూ‌కే మాజీ ఉప ప్రధాని

ఇరాక్ యుద్ధానికి దారి తీసిన పరిస్ధితులను విచారించటానికి గత బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన ఎంక్వైరీ కమిషన్, తన నివేదికను వెలువరించిన దరిమిలా బ్రిటన్ మాజీ నేతల ఒప్పుకోళ్ళు వరదలా ప్రవహిస్తున్నాయి. 2009లో అప్పటి ప్రధాని గార్డన్ బ్రౌన్, లార్డ్ జాన్ చిల్కాట్ నేతృత్వంలో నియమించిన విచారణ కమిషన్ కొద్ది రోజుల క్రితం విచారణ నివేదికను విడుదల చేసింది. ఆనాటి ప్రధాని టోని బ్లెయిర్ సరైన కారణాలు లేకుండా బ్రిటిష్ యువ సైనికుల ప్రాణాలను బలి పెడుతూ దేశాన్ని…