వేల కోట్ల నౌకా విధ్వంసక వ్యాపారం -ఫోటోలు

ఎంత భారీ నిర్మాణానికయినా ఏదో ఒక నాడు కాలం తీరిపోక తప్పదు. రాబట్టుకోదగిన విలువను అంతటినీ రాబట్టుకున్నాక గాని పెద్ద పెద్ద నిర్మాణాలను మనుషులు వదిలి పెట్టరు. ఇలా కాలం తీరిపోయిన భారీ నౌకలు, భవనాలు, కర్మాగారాలు.. మొదలయిన మౌలిక నిర్మాణాలను ఏం చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం రీ సైక్లింగ్! పర్యావరణం గురించిన స్పృహ పెరిగాక వాడిన వస్తువులను రీ సైక్లింగ్ చేసి మరో కొత్త వస్తువు తయారు చేయడం మనిషి పారంభించాడు. రీ సైక్లింగ్…