ప్యారిస్ దాడి: ఉగ్రవాదులను సాయుధం చేసింది ఫ్రాన్సే

జనవరి 7వ తారీఖున, కొత్త సంవత్సరం మత్తు ఇంకా వదలని ప్యారిస్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడి మత్తు విదిల్చుకుని అప్రమత్తం అయింది. రెండు దశాబ్దాలలోనే అత్యంత తీవ్రమైన సాయుధ దాడి నగరంపై జరిగిందన్న వార్త ప్యారిస్ పౌరులకు కలవరం కలిగించింది. ముసుగులు ధరించిన దుండగులు కొందరు ప్రఖ్యాత వ్యంగ్య పత్రిక కార్యాలయంపై దాడి చేసి ఎడిటర్ తో పాటు 12 మందిని కాల్చి చంపారని ఆ వార్త వారికి తెలియజేసింది. ఎలాంటి ప్రాధమిక దర్యాప్తు ముగియకుండానే ‘ఇది…