ముఖ్యమంత్రుల ఎగతాళికి బి.జె.పి సమర్ధన! -కార్టూన్

“నా ప్రియమైన ఎగతాళి మరియు వెక్కిరింపుల్లారా…” *** మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ముఖ్యమంత్రులు బి.జె.పి యేతర పార్టీలకు చెందినవారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్, హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ హుడాలు కాంగ్రెస్ పార్టీ నేతలు కాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం నిర్వహిస్తున్న జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నాయకుడు. ఇటీవల ఈ ముగ్గురితో కలిసి ప్రధాని పాల్గొన్న సభల్లో ప్రేక్షకుల్లో కొందరు పని గట్టుకుని ముఖ్యమంత్రులను వెక్కిరింపులతో వేధించే ప్రయత్నం చేశారు. మోడి…