ఐదోసారి ఢిల్లీ చర్చిలపై దాడి, ఎన్నికల కోసమేనా?

ప్రజల మధ్య మత తత్వ సెంటిమెంట్లు రెచ్చగొట్టి ఓట్లు కొల్లగొట్టేందుకు అలవాటు పడ్డ మతతత్వ శక్తులు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ఎత్తుగడలను అనుసరిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో కలిసి మెలసి జీవిస్తున్న ప్రజల మధ్య మతపరమైన భావోద్వేగాలను విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రత్యనిస్తున్నాయని ఐదోసారి మరో చర్చిపై జరిగిన దాడితో స్పష్టం అవుతోంది. జాతీయ రాజధానిలో రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయడంలో హిందూత్వ శక్తులు నిమగ్నం అయ్యాయి. విధానాలను చూపి విజయం సాధించడం మాని…