సబ్సిడీలు ప్రజాస్వామ్య సాధనకు మార్గం -ఈనాడు

‘అధ్యయనం’ సిరీస్ లో 9వ భాగం ఈ రోజు ఈనాడు పత్రిక చదువు పేజీలో ప్రచురించబడింది. పత్రిక చదివిన కొందరు మిత్రులు ‘అలా అర్ధం కాకుండా రాస్తే ఎలా?’ అని నిలదీశారు.  స్ధలాభావం వల్ల కత్తిరింపులకు గురి కావడంతో కొన్ని చోట్ల వివిధ అంశాలకు మధ్య లంకెలు మిస్ అయ్యాయి. దానితో అర్ధం కానట్లుగా ఉండడానికి ఆస్కారం ఏర్పడింది. బ్లాగ్ పాఠకుల కోసం ఈనాడు ప్రచురణను కింద ఇస్తున్నాను. బొమ్మపై క్లిక్ చేస్తే పెద్ద సైజులో చూడవచ్చు.…

సివిల్స్ డైరెక్టివ్ ‘ఎనలైజ్’ గురించి… -ఈనాడు

ఇది ప్రస్తుత ‘అధ్యయనం’ సిరీస్ లో 5వ భాగం. సివిల్స్ పరీక్షల్లో ఇచ్చే కొశ్చెన్ ట్యాగ్స్ లో ఒకటయిన ‘విశ్లేషణ’ గురించి ఈ రోజు చర్చించాను. ఈ 5వ భాగాన్ని ఈనాడు వెబ్ సైట్ లో చూడాలనుకుంటే కింది లింక్ క్లిక్ చేయగలరు. వేగంగా… సులభంగా గరిష్ట మార్కులు పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ లో చూడాలనుకుంటే కింది బొమ్మను క్లిక్ చేయగలరు. బొమ్మ పైన రైట్ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు కూడా.

చదువు: కొందరికి లక్షలతో, అనేకులకు వివక్షలతో…

‘అక్షర లక్షాధికారి’ అని శ్రీశ్రీకి పేరు. అక్షరాలను ఒడుపుగా పట్టుకుని, ఛందోబద్ధ పరిష్వంగాలను వదులించుకుని, లక్షలాది అక్షరాలతో యధేచ్చ ఉరికిపడే జలపాతంలా కవితా ఝరులను సృష్టించినందుకు ఆయనకు ఆ పేరు దక్కింది. ఇప్పుడు అక్షరాలతో లక్షాధికారులు అవుతున్నవారు ఎంతమందో కానీ, లక్షల రూపాయలకు అక్షరాలను అమ్ముకుంటున్నవారికి కొదవలేదు. తమ విద్యార్ధులకు ఇప్పటికీ ప్రభుత్వ బడుల్లోనే విద్యా బుద్ధులు నేర్పిస్తున్న పశ్చిమ దేశాలు మూడో ప్రపంచ దేశాల్లో మాత్రం విద్యను అమ్మి తీరాలని శాసించాయి. డంకేల్ ఒప్పందం ద్వారా,…