ట్రంపోకలిప్స్ పై అవగాహన -ద హిందూ…
డోనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ కు 45వ అధ్యక్షులు కానున్నారు. ఈ మాటలు నేడు 324 మంది అమెరికన్ల హృదయాలలో ప్రతిధ్వనిస్తుంది, కొందరు దిగ్భ్రాంతికి లోనై నిరుత్సాహానికి గురి కాగా ఇతరులు సంతోషంలో మైరిచిపోయారు. ఆశ్చర్యకరమైన ఫలితాల పట్ల వ్యక్తం అవుతున్న భావోద్వేగాల లోని ఈ శుద్ధ భిన్నత్వమే దేశం, రెండు సంవత్సరాల పాటు భిన్న ధ్రువాల వైపుగా సాగిన ఎన్నికల ప్రచారం అనంతరం, ఎంత లోతుగా విభజనకు గురై ఉన్నదో తెలియజేసేందుకు చురుకైన సంకేతం.…