మరో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం రావచ్చు -ఆర్.బి.ఐ గవర్నర్

భారత రిజర్వ్ బ్యాంకు గవర్నర్ బాంబు పేల్చారు. మరోసారి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించవచ్చని హెచ్చరించారు. ఆయన చెబుతున్నది 2008 నాటి సంక్షోభం తరహాది కూడా కాదు. ఏకంగా 1930ల నాటి మహా మాంద్యం తరహాలోనే సంక్షోభం రావచ్చని హెచ్చరించారు. 2008 నాటి సంక్షోభాన్ని ‘ద గ్రేట్ రిసెషన్’ అని పిలవగా, 1930ల నాటి సంక్షోభాన్ని ‘ద గ్రేట్ డిప్రెషన్’ గా పిలిచారు. రిసెషన్ కంటే డిప్రెషన్ మరింత లోతైన, విస్తారమైన సంక్షోభం. ఆనాటి డిప్రెషన్ నుండి…