గ్రెక్సిట్: మొదటి ప్రపంచ యుద్ధంలో గ్రీసు -4

మూడో భాగం తరువాయి………………… – గ్రీసు పెట్టుబడిదారుల దుస్సాహసం 20వ శతాబ్దం ఆరంభంలో టర్కీ సామ్రాజ్యం బలహీనపడడం, మార్కెట్ల పంపిణీలో వైరుధ్యాలు తలెత్తిన ఫలితంగా ఐరోపా రాజ్యాల మధ్య కుమ్ములాటలు తీవ్రం కావడంతో గ్రీసు పెట్టుబడిదారీ వర్గం తనను తాను పునరుద్ధరించుకునే ప్రయత్నం చేసింది. అయితే టర్కీ బూర్జువాల మద్దతుతో టర్కీ ఆర్మీలోని రెండవ శ్రేణి సైనికాధికారులు ‘యంగ్ టర్క్ మూవ్ మెంట్’ ఆరంభించి రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వ ఏర్పాటుకు డిమాండ్ చేశారు. వారి చర్యలు టర్కీ జాతీయవాదాన్ని…

గ్రెక్సిట్: ఆంగ్లో-అమెరికన్ భౌగోళిక రాజకీయ వ్యూహంలో పావు, గ్రీసు -3

రెండో భాగం తర్వాత…………………………. పశ్చిమ పెట్టుబడిదారీ వ్యవస్ధ గ్రీసును అభివృద్ధి చెందిన దేశంగా 1961 నుండి పరిగణిస్తోంది. (అభివృద్ధి చెందిన దేశాల క్లబ్ గా చెప్పే ఓ.ఇ.సి.డి కూటమిలో గ్రీసు సభ్య దేశం.) కానీ అక్కడి ప్రజలు, ముఖ్యంగా శ్రామిక ప్రజలు ఎన్నడూ ఆ అభివృద్ధిని అనుభవించలేదు. ఆధునిక గ్రీసు చరిత్రను ప్రజల దృక్కోణంలో పరిశీలిస్తే పాలకవర్గాల అణచివేతలతో పాటు, ప్రజల తిరుగుబాటు పోరాటాలు కూడా సమృద్ధిగా కనిపిస్తాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాజీ హిట్లర్…

గ్రెక్సిట్: పెట్టుబడిదారీ సంక్షోభ ఫలితం -2

మొదటి భాగం తరువాత……………… గ్రీసు అబద్ధాలు?! గ్రీసు 2001లో తన జాతీయ కరెన్సీ ‘డ్రాక్మా’ను రద్దు చేసుకుని ‘యూరో’ను స్వీకరించింది. సాంకేతికంగా చెప్పుకోవాలంటే ‘యూరో జోన్’ లో చేరింది. ఆనాటి గ్రీసు ప్రభుత్వం తమ ఆర్ధిక పరిస్ధితి గురించి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి, అబద్ధాలు చెప్పి యూరో జోన్ లో చేరిందని పశ్చిమ పత్రికలు, ఈ.యు, ఇ.సి.బి అధికారులు ఇప్పటికీ చెబుతారు. గ్రీసు దాచిపెట్టిన ఆర్ధిక సమస్యల వల్ల గ్రీసు అప్పు పెరుగుతూ పోయిందని, అది తడిసి…

గ్రెక్సిట్: జర్మనీ సామ్రాజ్యవాదం ఉక్కు కౌగిలిలో ఐరోపా -1

మొదటి భాగం………………. గత అయిదేళ్లుగా అంతర్జాతీయ స్ధాయిలో పతాక శీర్షికలలో నానుతున్న వార్త గ్రెక్సిట్! గత రెండేళ్లుగా గ్రెక్సిట్ వార్తల మధ్య వ్యవధి తగ్గుతూ వచ్చింది. ఈ యేడు జనవరిలో ‘రాడికల్ లెఫ్ట్’ గా పిలువపడుతున్న సిరిజా కూటమి అధికారం చేపట్టాక గ్రెక్సిట్ క్రమం తప్పని రోజువారీ వార్త అయింది. గ్రీక్ + ఎక్సిట్ కలిసి గ్రెక్సిట్ అయింది. ఎక్సిట్ అంటే బయటకు వెళ్లిపోవడం. గ్రీసు యూరో జోన్ నుండి బైటికి వెళ్లిపోయే పరిస్ధితులను గ్రెక్సిట్ అని…

గ్రీసు దివాలాకు యూరప్ ఏర్పాట్లు?

ఋణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఐరోపా రాజ్యాలు గ్రీసు దివాలా తీసే పరిస్ధితికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. యూరో జోన్ (యూరోను ఉమ్మడి కరెన్సీగా కలిగి ఉన్న 17 ఈ.యు సభ్య దేశాల సమూహం) నాయకురాలైన జర్మనీ ఆర్ధిక మంత్రి ఈ మేరకు తగిన సూచనలు ఇస్తున్నట్లు వాణిజ్య పత్రికలు, పరిశీలకులు భావిస్తున్నారు. గ్రీసు తన జాతీయ కరెన్సీ డ్రాక్మాను రద్దు చేసుకుని యూరోను తమ కరెన్సీగా స్వీకరించిన దేశాల్లో ఒకటి. 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం…

రికార్డులు తిరగ రాస్తున్న యూరోజోన్ నిరుద్యోగం

17 ఐరోపా దేశాల మానిటరీ యూనియన్ ‘యూరోజోన్’ నిరుద్యోగంలో తన రికార్డులు తానే తిరగ రాస్తోంది. ఉమ్మడి యూరో కరెన్సీ ఉనికిలోకి వచ్చిన గత 13 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా 12 శాతం నిరుద్యోగాన్ని నమోదు చేసింది. జనవరిలో 11.9 శాతంగా ఉన్న నిరీద్యోగ శాతం మరో 33,000 మంది ఉద్యోగాలు కోల్పోవడంతో ఫిబ్రవరిలో 12 శాతానికి పెరిగింది. ఐరోపా వ్యాపితంగా అధికారిక నిరుద్యోగుల సంఖ్య 1.91 కోట్లకు పై చిలుకేనని ఐరోపా గణాంక సంస్ధ…

మరోసారి పోరాట పధంలో గ్రీసు ప్రజలు, కార్మిక సంఘాలు

గ్రీసు ప్రజలు మరోసారి రోడ్డెక్కారు. పాత ప్రభుత్వం విధానాలనే కొత్త ప్రభుత్వం కూడా కొనసాగించడం పట్ల ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. త్రయం (troika) గా పిలిచే యూరోపియన్ యూనియన్ (ఇ.యు), యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఇ.సి.బి), ఐ.ఎం.ఎఫ్ లు సంయుక్తంగా విధించిన నూతన షరతులను ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధపడడం పట్ల దేశవ్యాపిత నిరసనలకు పూనుకున్నారు. త్రయం ఆదేశాల మేరకు కొత్త ప్రభుత్వం విధించ తలపెట్టిన 11.5 బిలియన్ యూరోల (15 బిలియన్ డాలర్లు) కోతలను మూకుమ్మడి నిరసన…

All options for Greece

అన్నీ టెబుల్ మీదే ఉన్నాయి -కార్టూన్

“అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నాం” ఇది ప్రభుత్వాలకూ, రాజకీయ నాయకులకూ ఊత పదం. దీన్నే ఆంగ్లంలో “ఆల్ ఆప్షన్స్ ఆర్ ఆన్ టేబుల్” అని అంటుంటారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా దగ్గర్నుండి, యూరప్ పాలకుల మీదుగా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, ఇండియా ప్రధాని మన్మోహన్ ల వరకూ దీన్ని పదే పదే వాడుతుంటారు. దానర్ధం నిజంగా అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కాదని అనేక సార్లు రుజువయ్యింది. యూరప్ రుణ సంక్షోభం, ఇరాన్ అణు ప్రమాదం, సిరియా కిరాయి తిరుగుబాటు,…

యూరోప్ లైఫ్ బోట్ కి వళ్ళంతా చిల్లులే -కార్టూన్

ఎడ తెగని గ్రీసు రుణ సంక్షోభం యూరపియన్ యూనియన్ ఓడను ముంచేస్తోంది. గ్రీసు కోసం ఇ.యు నాయకులు రక్షణ నిధి ని ప్రకటించినప్పటికీ అది గ్రీసు ను కాపాడుతుందన్న నమ్మకం కలగడం లేదు. ఈ లోపు ఇటలీ కూడా రుణ సంక్షోభంలో దూకడానికి సిద్ధంగా ఉంది. రుణ సంక్షోభం యూరప్ దేశాల ప్రభుత్వాలను కూలుస్తోంది. ఇటలీలో ప్రభుత్వం మెజారిటీ కోల్పోయి కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. గ్రీసు ప్రధాని రాజీనామాకి రంగం సిద్ధమైంది. ఎన్నికలూ జరగనున్నాయి. ఇటలీ ప్రధాని…