చైనా & తైవాన్: ట్రంప్ వెనకడుగు

అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినప్పటినుండీ, అధ్యక్ష పీఠాన్ని అధిష్టించాక కూడా చైనాపై కారాలు మిరియాలు నూరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, క్రమంగా చైనా వాస్తవాన్ని అర్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. తైవాన్ ప్రధానికి ఫోన్ చేసి చైనాలో వేడి రగిలించిన ట్రంప్ చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ తో ఫోన్ లో మాట్లాడిన అనంతరం తన అవగాహనను మార్చుకున్నాడు.  “అధ్యక్షుడు గ్జి విజ్ఞప్తి మేరకు ‘ఒక చైనా విధానం’ ను గుర్తించి గౌరవించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…

మా వ్యతిరేక కూటమిలో ఇండియా చేరదు -చైనా

భారత ప్రధాని నరేంద్ర మోడి అమెరికా పర్యటన ముగిసిన నేపధ్యంలో పర్యటన అనంతర పరిస్ధితిని చైనా ప్రభుత్వ అధికార పత్రిక పీపుల్స్ డెయిలీ సమీక్షించింది. అమెరికా తన నేతృత్వంలో తలపెట్టిన చైనా వ్యతిరేక కూటమిలో ఇండియా చేరే అవకాశం లేదని మోడి అమెరికా పర్యటన ద్వారా గ్రహించవచ్చని పత్రిక పేర్కొంది. తమ అవగాహనకు కారణాలను పత్రిక వివరించింది. భారత విదేశీ విధానం పునాదులు అలీన ఉద్యమంలో ఉన్నందున ప్రపంచ ధృవ పోటీల్లో ఇండియా ఒక పక్షం వహించబోదని…

జిన్ పింగ్: మోడి దౌత్యం నేర్పుగా…. -కార్టూన్

“… అనంతరం దారం తెగిపోకుండా ఇలా నేర్పుగా లాగి పట్టి…” ********* చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ భారత్ పర్యటనలో ఉండగానే చైనా-ఇండియా సరిహద్దులో లడఖ్ లో చైనా సైన్యం రెండు చోట్ల చొరబడిందని, కనీసం 500 మీటర్ల మేర చొచ్చుకు వచ్చి వెనక్కి వెళ్లబోమని భీష్మించ్చిందని వార్తలు వెలువడ్డాయి. భారత దేశంలో పత్రికలు, ఛానెళ్లలో పతాక శీర్షికలకు ఎక్కిన ఈ వార్తలు సహజంగానే ప్రధాని మోడీకి అగ్ని పరీక్షగా మారాయి. కాదా మరి! ప్రతిపక్షంలో…

పంచశీల ఇప్పటికీ శిరోధార్యమే -చైనా

ఓ మృత శరీరాన్ని తట్టి లేపేందుకు చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది. మరుపు పొరల్లో సమాధి అయిన పంచశీల సూత్రాలు ఇప్పటికీ శిరోధార్యమేనని చైనా అధ్యక్షుడు, భారత ఉపాధ్యక్షుడు బీజింగ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. చైనా, మియాన్మార్, ఇండియాలు కుదుర్చుకున్న పంచ శీల ఒప్పందానికి 60 యేళ్ళు పూర్తయిన సందర్భంగా బీజింగ్ లో ఓ కార్యక్రమం జరిగింది. ఇరుగు పొరుగు దేశాలపై ఆధిపత్యం చెలాయించే ఉద్దేశ్యం తమకు…