గోవా బిజేపి అవినీతి: 88 మైనింగ్ కాంట్రాక్టులు రద్దు చేసిన కోర్టు
కాంగ్రెస్ పార్టీ అవినీతికి రారాజు అని బిజేపి నేతలు తిట్టి పోస్తారు. ఎన్నడూ నోరు మెదపని ప్రధాని నరేంద్ర మోడి ఎన్నడన్నా నోరు తెరిస్తే మాత్రం కాంగ్రెస్ అవినీతి గురించీ, అనువంశిక పాలన గురించీ విమర్శించకుండా ఉండడు. కానీ కాంగ్రెస్ అవినీతిని కొనసాగించడానికి మాత్రం బిజేపికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. గోవా బిజేపి ప్రభుత్వం రెన్యూవల్ చేసిన 88 మైనింగ్ లీజులు అక్రమం అని సుప్రీం కోర్టు ధర్మాసనం నిర్ధారించింది. లీజులను రద్దు చేస్తూ ఈ రోజు…