జైట్లీపై విచారణ చట్ట విరుద్ధం -కేంద్రం

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పాల్పడ్డారని ఆరోపించబడుతున్న డి‌డి‌సి‌ఏ కుంభకోణంపై విచారణ చట్ట విరుద్ధం అని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ద్వారా ‘సలహా ఇవ్వండి’ అంటూ లేఖ రాయించుకుని ఆనక ‘ఆ విచారణ చట్టబద్ధం కాదు’ అని బి.జె.పి ప్రభుత్వం ప్రకటించేసింది. ‘అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వ విచారణ చట్ట విరుద్ధం’ అని నిర్ధారించిన మొట్ట మొదటి కేంద్ర ప్రభుత్వంగా నరేంద్ర మోడి నేతృత్వంలోని ప్రభుత్వం ఘనతను మూటగట్టుకుంది. ‘అవినీతిని అంతం…

మాది వైట్ వాష్ కమిటి అనే ప్రభుత్వం అనుకుంది –జస్టిస్ వర్మ కమిటీ సభ్యుడు

[ఢిల్లీ బస్సులో సామూహిక అత్యాచారం దుర్ఘటనపై వెల్లువెత్తిన ప్రజల డిమాండ్స్ కు స్పందించి మహిళా చట్టాలలో మార్పులు తేవడానికి నియమించబడిన జస్టిస్ వర్మ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. 30 రోజుల గడువు కోరి 29 రోజుల్లోనే నివేదిక పూర్తి చేసి ఇచ్చిన కమిటీ దానికి కారణం కూడా చెప్పింది. అనేక సామాజిక కోణాలతో ముడి పడి ఉన్న బాధ్యతను కేవలం ముగ్గురు సభ్యులు తీవ్రంగా శ్రమించి ముప్పై రోజుల్లోనే అధ్యయనం చేసి…