మోడికి బహిరంగ లేఖ -గోపాలకృష్ణ గాంధీ 2
పశ్చిమ పంజాబ్ నుండి తరిమివేయబడ్డ సిక్కులు, హిందువులకు మల్లే, కాశ్మీరీ పండిట్లకు మల్లే భారత దేశంలోని మైనారిటీలు అందరూ, ఒక్క ముస్లింలు మాత్రమే కాదు సుమా, తమ మనో ఫలకాలపై గాయపడ్డ చారికలు కలిగి ఉన్నారు. నిజంగానే జరుగుతాయో లేక ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొట్టినందువల్ల జరుగుతాయో… అకస్మాత్తుగా అల్లర్లు జరగొచ్చన్న భయం, అవి మళ్ళీ మరిన్ని రెట్లు పగ సాధింపు పేరుతో తిరిగి తలుపు తడతాయన్న భయం, వారిని పట్టి పీడిస్తోంది. అవి మహిళలను అత్యంత ప్రత్యేకంగా లక్ష్యం…