మోడీ కుట్ర విప్పి చెప్పిన సాహసికి లేఖ

గుజరాత్ మారణకాండలో నరేంద్ర మోడీ హస్తం సాక్ష్యాధారాలు బైటపెట్టాడన్న కోపంతో సీనియర్ పోలీసు అధికారి సంజీవ్ భట్ ను ఒక పాత కేసులో ఇరికించి ముప్పై సంవత్సరాల శిక్ష వేసిన సందర్భంలో హర్ష్ మందర్ రాసిన లేఖ. (వీక్షణం జూలై 2019 సంచిక నుంచి) – హర్ష్ మందర్, IAS (తెలుగు: ఎన్ వేణుగోపాల్) ప్రియమైన సంజీవ్, ఈ ఉత్తరం నీకందుతుందా, అందినా ఎప్పుడు అందుతుంది, నువ్విది చదవగలవా నాకు తెలియదు. ఈసారి నిన్ను జైలులో కలవడానికి…

విచారణ చెయ్యకుండానే మోడికి క్లీన్ చిట్ -జకీయా జాఫ్రీ వాదన

గోధ్రా రైలు దహనం అనంతరం గుజరాత్ రాష్ట్ర వ్యాపితంగా ముస్లింలపై జరిగిన మారణకాండ విషయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ (సిట్) క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. క్లీన్ చిట్ పై నిరసన పిటిషన్ దాఖలు చేసిన జకీయా జాఫ్రీ తరపున అడ్వకేట్ కపిల్ సిబాల్ తన వాదనలు ఈ రోజు కొనసాగించారు. జాఫ్రీ చేసిన ఫిర్యాదుపై అనేక సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నప్పటికీ వాటిపై పరిశోధన జరపకుండానే…

‘ముస్లింల నరమేధం గుజరాత్ అంతర్గత వ్యవహారం’, అమెరికా రాయబారితో నరేంద్ర మోడి

(ఈ ఆర్టికల్ గత సంవత్సరం మార్చి నెలలో ఇదే బ్లాగ్ లో ప్రచురించబడింది. బ్లాగ్ ప్రారంభంలో రాసినందున పెద్దగా పాఠకుల దృష్టికి రాలేదు. ప్రధాన మంత్రి పదవి కోసం నరేంద్ర మోడి చేస్తున్న ప్రయత్నాలకు ఇంటా బయటా వస్తున్న మద్దతు, పోటీల దృష్ట్యా దీనికి ప్రాధాన్యత కొనసాగుతోంది. అందువలన పునర్ముద్రిస్తున్నాను. -విశేఖర్) 2002 సంవత్సరంలో గోధ్రా రైలు బోగీ దహనం అనంతరం నరేంద్ర మోడి ప్రభుత్వం నాయకత్వంలో ముస్లిం ప్రజలపై సాగించిన నరమేధానికి బాధ్యులైన వారిపై ఏం…

కూల్చిన మసీదులు కట్టాల్సిందే, మోడీకి సుప్రీం ఆదేశాలు

గోధ్రా రైలు దహనం అనంతరం గుజరాత్ లో కూల్చిన మసీదులను తిరిగి కట్టాలంటూ గుజరాత్ హై కోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే విధించడానికి సుప్రీం కోర్టు తిరస్కరించింది. మతపరమైన మందిరాల నిర్మాణానికి ప్రభుత్వాలు డబ్బు ఖర్చు పెట్టడం ‘సెక్యులరిస్టు సూత్రాలకు విరుద్ధం’ అన్న గుజరాత్ ప్రభుత్వ వాదనను కోర్టు తిరస్కరించింది. గుజరాత్ మారణకాండ సందర్భంగా ముస్లింల ప్రార్ధనా స్ధలాలను కాపాడడంలో విఫలం అవడమే కాక కూల్చివేతకు గురయిన మసీదులను నిర్మించకూడదని రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం…

‘ముస్లింల నరమేధం గుజరాత్ అంతర్గత వ్యవహారం’, అమెరికా రాయబారితో నరేంద్ర మోడి – 2

“దీనికి మోడి గుర్రుమంటూ ‘భారత జాతీయ మాన వహక్కుల సంఘం పక్షపాత పూరితమైనది. దాని నిర్ణయాల్లో తీవ్ర తప్పిదాలున్నాయి. అదీ కాక అమెరికా కొద్ది సంఖ్యలో ఉన్న చిన్న చిన్న ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్ధలపైనే ఆధారపడుతోంది. వాటికి వాస్తవ పరిస్ధితులేవీ తెలియదు. పైగా వాటికి స్వార్ధ ప్రయోజనాలున్నాయి. ఏదైమైనా అధికారులు తప్పు చేసినట్లయితే వారిని విచారించి, శిక్షించేందుకు కోర్టులున్నాయి. ముఖ్యమంత్రులు న్యాయ ప్రక్రియల్లో జోక్యం చేసుకోలేరు’ అని సమాధానమిచ్చాడు” అని ఓవెన్ రాశాడు.  కాన్సల్ జనరల్ దానికి…

‘ముస్లింల నరమేధం గుజరాత్ అంతర్గత వ్యవహారం’, అమెరికా రాయబారితో నరేంద్ర మోడి – 1

2002 సంవత్సరంలో గోధ్రా రైలు బోగీ దహనం అనంతరం నరేంద్ర మోడి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వంలో ముస్లిం ప్రజలపై సాగించిన నరమేధానికి బాధ్యులైన వారిపై ఏం చర్య తీసుకున్నారు అనడిగిన అమెరికా రాయబారి ప్రశ్నకు కోపంతో, “అది గుజరాత్ అంతర్గత వ్యవహారం. ఆ విషయం గురించి ప్రశ్నించే అధికారం అమెరికాకు లేదు” అని నరేంద్ర మోడి హుంకరించిన విషయం అమెరికా రాయబారి రాసిన కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. ఇండియాలో పని చేసిన అమెరికా రాయబారులు అమెరికా…