అమెరికా విదేశీ మంత్రులపై జర్మనీ గూఢచర్యం

తమ దేశంలో గూఢచర్యం చేసినందుకు అమెరికాపై కారాలు మిరియాలు నూరుతున్న జర్మనీ అమెరికా పైన తానూ అదే నిర్వాకానికి పాల్పడింది. ఈ సంగతి జర్మనీ పత్రిక డెర్ స్పీజెల్ బైట పెట్టింది. అయితే అది పొరబాటున జరిగిందని అది కూడా ఒక్కసారే జరిగిందని ఆ పత్రిక చెబుతోంది. ఒబామా మొదటి అధ్యక్షరికంలో విదేశీ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) గా హిల్లరీ క్లింటన్ పని చేయగా రెండో విడత అధ్యక్షరికంలో జాన్ కెర్రీ పని చేస్తున్నారు. వీరిద్దరి…

గూఢచారుల పేర్లివ్వండి! -ఎంబసీలకు జర్మనీ ఆదేశం

జర్మనీ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం ప్రకటించింది. ఎన్.ఎస్.ఎ, సి.ఐ.ఎ లాంటి అమెరికా గూఢచార సంస్ధలతో విసిగిపోయి ఇక ఎంత మాత్రం సహించలేని దశకు చేరుకున్నట్లుగా సంకేతాలిస్తూ దేశంలోని విదేశీ ఎంబసీలన్నీ తమ గూఢచార అధికారుల పేర్లను వెల్లడించాలని ఆదేశించింది. తమ దేశంలో విధులు నిర్వర్తిస్తున్న గూఢచారులందరి పేర్లను తమకు అప్పగించాలని కోరింది. ఈ మేరకు విదేశీ ఎంబసీలన్నింటికీ జర్మనీ ప్రభుత్వం గత వారం లేఖలు రాసిందని పత్రికలు సమాచారం ఇచ్చాయి. జర్మనీ విదేశీ మంత్రిత్వ శాఖ…

ప్రశ్న: గూఢచర్యం అన్ని దేశాలు చేస్తాయిగా?

ప్రశ్న (నరేంద్ర): గూఢచర్యం అన్ని దేశాలు చేసే పనే కదా? ఒక్క అమెరికానే తప్పు పట్టడం అన్యాయం కదా? జవాబు: ఈ ప్రశ్న వేసి చాలా రోజులు అయింది. సమాధానం బాగా ఆలస్యం అయింది. ఇలా సమాధానం ఆలస్యం అయిన ప్రశ్నలు ఇంకా ఉన్నాయి. ఇచ్చే సమాధానం వివరంగా సంతృప్తికరంగా ఉండాలన్న ఆలోచన చేస్తాను. ఈ ఆలోచన సమాధానాన్ని మరింత ఆలస్యం చేస్తోంది. అందుకు చింతిస్తూ… నిజమే. గూఢచర్యం అన్ని దేశాలూ చేస్తాయి. ఇండియా కూడా గూఢచర్యం…

‘గూగుల్,’ ‘స్కైప్’ సర్వీసులను పర్యవేక్షించే అవకాశం మా గూఢచాలకు ఇవ్వాలి -భారత ప్రభుత్వం

‘గూగుల్ ఇంక్,’ ‘స్కైప్ లిమిటెడ్’ లతో పాటు ఇతర ఇంటర్నెట్ సంస్ధలు, వినియోగదారులకు అందించే సేవలను పర్యవేక్షించే అవకాశం దేశ భద్రతా ఏజెన్సీలకు ఉండాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఆయా కంపెనీలు తాము అందజేసే సర్వీసుల ద్వారా మార్పిడి చేసే సమాచారాన్ని ముందుగానే చదివే అవకాశం భారత దేశ భధ్రతా బలగాలు, గూఢచార సంస్ధలకు ఉండాలనీ, భారత దేశ భద్రత రీత్యా అది అవసరమనీ సంబంధిత కేంద్ర మంత్రి బుధవారం, పరిశ్రమల సమావేశాల సందర్భంగా కోరాడు.…

‘ముస్లింల నరమేధం గుజరాత్ అంతర్గత వ్యవహారం’, అమెరికా రాయబారితో నరేంద్ర మోడి – 2

“దీనికి మోడి గుర్రుమంటూ ‘భారత జాతీయ మాన వహక్కుల సంఘం పక్షపాత పూరితమైనది. దాని నిర్ణయాల్లో తీవ్ర తప్పిదాలున్నాయి. అదీ కాక అమెరికా కొద్ది సంఖ్యలో ఉన్న చిన్న చిన్న ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్ధలపైనే ఆధారపడుతోంది. వాటికి వాస్తవ పరిస్ధితులేవీ తెలియదు. పైగా వాటికి స్వార్ధ ప్రయోజనాలున్నాయి. ఏదైమైనా అధికారులు తప్పు చేసినట్లయితే వారిని విచారించి, శిక్షించేందుకు కోర్టులున్నాయి. ముఖ్యమంత్రులు న్యాయ ప్రక్రియల్లో జోక్యం చేసుకోలేరు’ అని సమాధానమిచ్చాడు” అని ఓవెన్ రాశాడు.  కాన్సల్ జనరల్ దానికి…

‘ముస్లింల నరమేధం గుజరాత్ అంతర్గత వ్యవహారం’, అమెరికా రాయబారితో నరేంద్ర మోడి – 1

2002 సంవత్సరంలో గోధ్రా రైలు బోగీ దహనం అనంతరం నరేంద్ర మోడి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వంలో ముస్లిం ప్రజలపై సాగించిన నరమేధానికి బాధ్యులైన వారిపై ఏం చర్య తీసుకున్నారు అనడిగిన అమెరికా రాయబారి ప్రశ్నకు కోపంతో, “అది గుజరాత్ అంతర్గత వ్యవహారం. ఆ విషయం గురించి ప్రశ్నించే అధికారం అమెరికాకు లేదు” అని నరేంద్ర మోడి హుంకరించిన విషయం అమెరికా రాయబారి రాసిన కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. ఇండియాలో పని చేసిన అమెరికా రాయబారులు అమెరికా…