ప్రశ్న: మన డేటా అమ్ముకుంటే నష్టం ఏమిటి?

లోకేశ్వర్: “వినియోగదారుల సమాచారాన్ని ఇతర సంస్థలకు అమ్ముకుంటే మనకు వచ్చే నష్టమేంటి? సేవలని ఉచితంగా ఇస్తున్నప్పుడు వాటిని పూడ్చుకోవడానికి ఇలాంటివి చేయడంలో తప్పేముంది?” అనే సగటు పౌరుడి/వినియోగదారుడికి సమాధానం ఏంటి? (నాకు కూడా) సమాధానం:  ఈ అనుమానానికి చాలా పెద్ద సమాధానం, సమాచారం ఇవ్వాలి. విస్తృత విశ్లేషణ చెయ్యాలి. అందుకని కాస్త తీరికగా రాయొచ్చు అనుకున్నాను. మీరు రెండోసారి అడగడంతో క్లుప్తంగా రాస్తున్నాను. మనకొక ఉత్తరం వచ్చిందనుకుందాం. దాన్ని పక్కింటి వాళ్ళు చించి చదివితే మన రియాక్షన్…

సి.బి.ఐ విచారణలో గూగుల్ మ్యాప్స్

గూగుల్ ఇండియా కంపెనీపై పోలీసులు వేసిన కేసు సి.బి.ఐ చేతుల్లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. భారత పౌరులకు గూగుల్ నిర్వహించిన మేపధాన్-2013  పోటీ వల్ల దేశ భద్రతకు ప్రమాదం అని బి.జె.పి ఎం.పి లు గత సం. ఫిర్యాదు చేయడంతో గూగుల్ అతి తెలివి వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదును సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్ధారించడంతో పోలీసులు విచారణ చేపట్టినట్లు గత సం. ఏప్రిల్ లో పత్రికలు తెలిపాయి. ఈ కేసును స్వీకరించిన సి.బి.ఐ ‘ప్రాధమిక విచారణ’…

యాండ్రాయిడ్ కాపీరైట్ కేసు: గూగుల్ పై ఒరకిల్ గెలుపు

ఇన్ఫోర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు ఒకరిపై మరొకరు కాపీ రైట్ ఉల్లంఘన కేసులు పెట్టుకోవడం ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. మొబైల్ ఫోన్ డిజైన్, టెక్నాలజీల విషయంలో సామ్ సంగ్, యాపిల్ కంపెనీల మధ్య సాగిన సుదీర్ఘ కోర్టు పోరాటంలో ఒక భాగం కొద్ది రోజుల క్రితమే ముగిసింది. ఇప్పుడు గూగుల్, ఒరకిల్ కంపెనీల మధ్య నడిచిన పోరు ఒక కొలిక్కి వచ్చింది. యాపిల్ ఆశించిన నష్టపరిహారంలో కేవలం 10వ వంతుకంటే తక్కువ మాత్రమే సామ్ సంగ్ చెల్లించాలని…

గూగుల్ Vs బైదు (చైనా): అమెరికాలో వింత తీర్పు

మనకి భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ఎలాగో అమెరికాలో ఫస్ట్ అమెండ్ మెంట్ అలాగ. ఈ ఫస్ట్ అమెండ్ మెంట్ ని అడ్డం పెట్టుకుని చైనా సర్చ్ ఇంజన్ బైదు పైన దెబ్బ కొట్టాలని చూసిన చైనీస్ అమెరికన్ ప్రముఖులు కొందరు అమెరికా కోర్టు ఇచ్చిన ఓ విచిత్రమైన తీర్పుతో తామే ఖంగు తినాల్సి వచ్చింది. చైనా ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే భావాలను చైనాలో అడుగు పెట్టకుండా బైదు సర్చ్ ఇంజన్ ఫిల్టర్ చేసి అడ్డుకుంటోందని దీనివల్ల తమ ప్రజాస్వామిక…

వాట్సప్ స్వాధీనం: గూగుల్ పై ఫేస్ బుక్ విజయం

‘WhatsApp’ అప్లికేషన్ కొనుగోలు మరియు స్వాధీనం (acquisition) కోసం జరిగిన పోటీలో ఫేస్ బుక్ అధిపతి మార్క్ జుకర్ బర్గ్ విజయం సాధించాడు. దానితో త్వరలో జరగబోయే ప్రపంచ స్ధాయి ఐ.టి (మొబైల్) కాన్ఫరెన్స్ లో జుకర్ బర్గ్ విజయగర్వంతో పాల్గొననున్నాడని వ్యాపార వార్తా సంస్ధలు ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి దాదాపు ప్రతి రంగంలోనూ పాతుకుపోయిన గూగుల్ ని త్రోసిరాజనడం అంటే మాటలు కాదు మరి! స్మార్ట్ ఫోన్ ల దగ్గర నుండి మధ్య…

యాహూ ఒడిలో టంబ్లర్, గూగుల్ ‘మేయర్’ పాచిక

గూగుల్ అభివృద్ధిలో దశాబ్ద కాలం గడిపి ప్రత్యర్ధి కంపెనీ ‘యాహూ’ సి.ఇ.ఓ గా పది నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన మెరిస్సా మేయర్, కొత్త బాధ్యతల్లో తన మొదటి పాచిక విసిరినట్లు కనిపిస్తోంది. అంతర్జాలంలో విస్తృత యూజర్ బేస్ ఉన్న టంబ్లర్ బ్లాగింగ్ వేదికను కొనుగోలు చేయడానికి యాహూ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ (ఎ.పి) తెలిపింది. 1.3 బిలియన్ డాలర్లకు (దరిదాపు 7,000 కోట్ల రూపాయలు) బేరం కుదిరినట్లు ఎ.పి వార్తా సంస్ధ సమాచారం.…

గూగుల్, ఫేస్ బుక్ లు పిల్లలకు ఎలా చేరువగా ఉన్నాయి? -కోర్టు ఆరా

ఇంటర్నెట్ లో సామాజిక కార్యక్రమాల ముసుగు ధరించే ఐ.టి వ్యాపార కంపెనీల వ్యవహారం పైన భారత దేశంలోని కోర్టులు కొరడా ఝళిపించడానికి సిద్ధం అవుతున్నాయి. చట్టబద్ధ మైన వయసు 18 సంవత్సరాల లోపలి పిల్లలకు ఫేస్ బుక్, గూగుల్ సామాజిక వెబ్ సైట్లు పిల్లలకు ఎలా అందుబాటులో వస్తున్నాయో వివరించాలని ఢిల్లీ హై కోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. చట్టాలను ఉల్లంఘిస్తూ భారత వినియోగదారుల వినియోగదారుల వ్యక్తిగత వివరాల డేటాను అమెరికా కంపెనీలు అమెరికాకు పంపిస్తున్నాయని తద్వారా…

Free app

ఈ ఆప్ మీకు ఉచితం -కార్టూన్

ఇంటర్నెట్ సంస్ధలు, సాఫ్ట్ వేర్ డవలపర్లు ఉచితంగా ‘అప్లికేషన్లు’ ఆఫర్ చేస్తూ వినియోగదారుల ప్రైవసీ ని తీవ్రంగా కొల్లగొడుతున్నాయి. వారిలో గూగుల్ అగ్ర స్ధానంలో ఉంది. వినియోగదారుల సమాచారాన్ని రహస్యంగా, అనుమతి లేకుండా దొంగిలించి నిలవ చేస్తున్నందుకు గూగుల్ పైన అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ విచారణ చేస్తోంది. జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్ లాంటి దేశాల పార్లమెంటులు గూగుల్ దుర్మార్గాలను తీవ్ర స్ధాయిలో ఖండించాయి. యూరోప్ లో చాలా ప్రభుత్వాలు గూగుల్ వ్యాపార పద్ధతులపైనా, మోసాలపైనా విచారణ…

‘గూగుల్,’ ‘స్కైప్’ సర్వీసులను పర్యవేక్షించే అవకాశం మా గూఢచాలకు ఇవ్వాలి -భారత ప్రభుత్వం

‘గూగుల్ ఇంక్,’ ‘స్కైప్ లిమిటెడ్’ లతో పాటు ఇతర ఇంటర్నెట్ సంస్ధలు, వినియోగదారులకు అందించే సేవలను పర్యవేక్షించే అవకాశం దేశ భద్రతా ఏజెన్సీలకు ఉండాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఆయా కంపెనీలు తాము అందజేసే సర్వీసుల ద్వారా మార్పిడి చేసే సమాచారాన్ని ముందుగానే చదివే అవకాశం భారత దేశ భధ్రతా బలగాలు, గూఢచార సంస్ధలకు ఉండాలనీ, భారత దేశ భద్రత రీత్యా అది అవసరమనీ సంబంధిత కేంద్ర మంత్రి బుధవారం, పరిశ్రమల సమావేశాల సందర్భంగా కోరాడు.…

నష్ట పోతావ్! గూగుల్‌కి చైనా అధికార పత్రిక హెచ్చరిక

చైనా ప్రభుత్వంపై పరోక్షంగా హేకింగ్ ఆరోపణలు సంధించిన గూగుల్ సంస్ధకు చైనా ప్రభుత్వం తన అధికారిక పత్రిక ద్వారా స్పందించింది. అమెరికా, చైనాల మధ్య ఉన్న రాజకీయ విభేధాలను స్వప్రయోజనాలకు వినియోగించుకోవలని చూస్తే “నష్టపోతావ్!” అని పీపుల్స్ డైలీ పత్రిక హెచ్చరించింది. విదేశాల్లో పంపిణీకి వెలువడే పీపుల్సు డైలీ పత్రిక మొదటి పేజీలో రాసిన సంపాదకీయంలో ఈ హెచ్చరిక చేసింది. తన ఆరోపణల ద్వారా గూగుల్ తన వ్యాపారావకాశాలకు ప్రమాదం తెచ్చుకుంటోందని పత్రిక హెచ్చరించింది. గూగుల్ ఈ…