భూతద్దం పరిశీలనలో గూగుల్ -ది హిందు ఎడిట్..
అయిదేళ్ళ పాటు కొనసాగిన ప్రక్రియ అనంతరం, గూగుల్ కంపెనీ అనుచిత (వ్యాపార) పద్ధతులను పాటిస్తున్న ఆరోపణలపై విచారణ చేయనున్నట్లు యూరోపియన్ కమిషన్ లాంఛనంగా ప్రకటించింది. యూరప్ లో ఇంటర్నెట్ శోధన సేవల మార్కెట్ లో తనకున్న గుత్తస్వామ్యాన్ని తన స్వార్ధ ప్రయోజనాలకు గూగుల్ కంపెనీ వాడుకుంటోందన్నది ఆరోపణ. ప్రధాన ఆరోపణల్లో ఒకటి, గూగుల్ లో పోలిక కొనుగోళ్ళ (comparison shopping) పని పద్ధతికి సంబంధించినది. ‘ఉత్పత్తుల పోలిక కొనుగోలు’ విధానం, వినియోగదారులకు ఆన్ లైన్ షాపింగ్ వెబ్…