విచారణ చెయ్యకుండానే మోడికి క్లీన్ చిట్ -జకీయా జాఫ్రీ వాదన
గోధ్రా రైలు దహనం అనంతరం గుజరాత్ రాష్ట్ర వ్యాపితంగా ముస్లింలపై జరిగిన మారణకాండ విషయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ (సిట్) క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. క్లీన్ చిట్ పై నిరసన పిటిషన్ దాఖలు చేసిన జకీయా జాఫ్రీ తరపున అడ్వకేట్ కపిల్ సిబాల్ తన వాదనలు ఈ రోజు కొనసాగించారు. జాఫ్రీ చేసిన ఫిర్యాదుపై అనేక సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నప్పటికీ వాటిపై పరిశోధన జరపకుండానే…