కులాలవారి శ్మశానవాటికలు కోర్టుకు కొత్తేనట!

“ఇటా…, అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు…” అని ‘శ్మశాన వాటి’ కావ్యంలో గుర్రం జాషువా గారు ప్రస్తావిస్తారు. జాషువా జీవించినప్పటి పరిస్ధితి ఏమిటో గానీ ఇప్పుడైతే ఈ పరిశీలనలో వాస్తవం లేదు. దాదాపు ప్రతి ఊరిలోనూ కులాల వారీగా (బ్రాడ్ గా) శ్మశాన వాటికలు ఇప్పటికీ ఉన్నాయి. అగ్ర కులాలకు ఉమ్మడి ఒక శ్మశాన వాటిక ఉండవచ్చునేమో గానీ నిమ్న కులాలకు మాత్రం అందులో ప్రవేశం ఉండదు. రాజస్ధాన్ లో ఇలాంటి విషయం ఒకటి కోర్టు దృష్టికి…