మోడీకి సమన్లు ఇస్తే $10 వేల బహుమతి

పట్టిస్తే పదివేలు! ఈ పేరుతో పాత తెలుగు సినిమా ఒకటి ఉందనుకుంటా. అమెరికాకు అధికార పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడికి న్యూయార్క్ ఫెడరల్ కోర్టు జారీ చేసిన సమన్లు అందించేందుకు అక్కడి మానవ హక్కుల సంస్ధ సరిగ్గా ఇలాంటి మార్గాన్నే ఎంచుకుంది. కోర్టు సమన్లను నరేంద్ర మోడీకి అందజేసినవారికి 10,000 డాలర్లు బహుమతిగా ఇస్తామని ఎ.జె.సి తరపు లాయర్ గుర్పత్వంత్ సింగ్ పన్నున్ ప్రకటించారు. భారత దేశంలో నక్సలైట్ నాయకులను పట్టుకోవడానికి వారి తలలకు…