ప్రమాదకర పహరా -ద హిందు ఎడిట్…

[Dangerous vigilantism శీర్షికన ఈ రోజు -జులై 21- ద హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు యధాతధ అనువాదం.] ********* గుజరాత్ లోని చిన్న పట్టణం ఉనా వద్ద “గో రక్షణ” కావలిదారుల చేతుల్లో కొందరు దళితులు హింసకు గురయిన సంఘటన, పార్లమెంటులో ప్రతిధ్వనిస్తుండగానే దానిపై నిరసనలు రాష్ట్ర వ్యాపితంగా విస్తరించడం కొనసాగుతూనే ఉన్నాయి. దళితుల నాయకత్వంలోని ఆందోళనలతో అట్టుడుకుతున్న సౌరాష్ట్రలో మెజారిటీ ప్రాంతాలు బుధవారం బంద్ పిలుపును అనుసరించి మూసివేతకు గురయ్యాయి. అక్కడ ఆందోళనకారులు వివిధ…

క్లుప్తంగా… 8/4/15

గుజరాత్ లో ముస్లిం తరిమివేత హిందూత్వ కోరలు చాస్తూ విషం చిమ్ముతున్న వార్తలు క్రమంగా పెరిగిపోతున్నాయి. గుజరాత్ లో భావనగర్ జిల్లాలోని ఒక చోట 60 హిందూ కుటుంబాల మధ్య నివశిస్తున్న ఒకే ఒక్క ముస్లిం కుటుంబాన్ని అక్కడి నుండి బలవంతంగా తన్ని తగలేశారు. ముస్లిం కుటుంబాన్ని బలవంతంగా తరిమి కొట్టాలని గత సం. ఏప్రిల్ లో హిందూత్వ గణానికి ఉద్భోదించిన కేసులో విశ్వ హిందూ పరిషత్ నాయకుడు ప్రవీణ్ తొగాడియా ఇప్పటికీ కోర్టు, ఎలక్షన్ కమిషన్…

నాకు బస్సు, నా గార్డులకు కార్లా? -యశోదాబెన్ ఆర్.టి.ఐ

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఈ దేశ ప్రధాని భార్య మండి పడుతోంది. ప్రోటో కాల్ పేరుతో తన రక్షణ కోసం 10 గార్డులను నియమించి వారి ప్రయాణానికి కార్లు ఇచ్చారని, తనకు మాత్రం ప్రభుత్వ ప్రయాణ వాహనం బస్సులో మాత్రమే వెళ్ళే అవకాశం దక్కిందని ఇదెక్కడి విడ్డూరమని ఆమె ప్రశ్నిస్తున్నారు. అసలు ప్రోటోకాల్ అంటే ఏమిటో చెప్పాలని ఆమె సమాచార హక్కు చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తనకు గార్డులను నియమించిన ఆదేశాలు…

ఉప ఎన్నికలు: సడలుతున్న బి.జె.పి కుదుళ్లు

పార్లమెంటు, అసెంబ్లీ స్ధానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. లోక్ సభ ఎన్నికల్లో బి.జె.పి ప్రదర్శనకు ఉప ఎన్నికల ఫలితాలు దాదాపు విరుద్ధంగా వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంటు ఎన్నికలకు మధ్య ప్రజలు తేడా చూడడం ప్రారంభించారా అన్న అనుమానం కూడా ఉప ఎన్నికల ఫలితాలు కలిగిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే భారత ప్రజలు సాపేక్షికంగా రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నట్లే లెక్క. ఎలా చెప్పుకున్నా బి.జె.పి, అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే లోక్ సభ ఎన్నికల్లో…

మోడి & అమిత్ షా: ఇక పనిలోకి దిగుదాం! -కార్టూన్

కొత్త ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తోడనే గుజరాత్ లో సంచలన కేసుల కధలు ఒక్కొక్కటీ కంచికి ప్రయాణం కడుతున్నాయి. ఆయా కేసుల్లో నిందితులకు గౌరవ మర్యాదలతో పదవులు దక్కుతున్నాయి. షోరాబుద్దీన్ షేక్ (మరియు) ఆయన భార్య  ఎన్ కౌంటర్, ఇష్రత్ జహాన్ (మరియు మరో ముగ్గురు ముస్లిం యువకులు) ఎన్ కౌంటర్, తులసీరాం ప్రజాపతి హత్య తదితర కేసుల్లో నిందితులైన ఐ.పి.ఎస్ అధికారులు ఇద్దరిని సగౌరవంగా తిరిగి పదవులు కట్టబెట్టారు. ఆషామాషీ పదవులు కాకుండా శక్తివంతమైన…

150 గోతాల డబ్బు4 ట్రక్కుల్లో గుజరాత్ కి వెళ్తూ పట్టుబడింది

బహుశా ఇంత మొత్తంలో డబ్బు, నగలు, వజ్రాలు పట్టుబడడం చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. ఎంత విలువ ఉంటుందో తేల్చడానికి కూడా రెండు రోజులు పట్టేటంత డబ్బు, నగలివి. ముంబై రైల్వే స్టేషన్ నుండి గుజరాత్ కు రవాణా కానుండగా పట్టుబడింది. 40 మంది అంగడియాలు నాలుగు ట్రక్కుల్లో, 150 గోతాల్లో నింపుకుని డబ్బు కట్టలు, బంగారు నగలు, వజ్రాలు ముంబై సబర్బన్ రైల్వే స్టేషన్ కు తీసుకెళ్తుండగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్.ఐ.ఏ), ఇన్ కమ్…