‘ముస్లింల నరమేధం గుజరాత్ అంతర్గత వ్యవహారం’, అమెరికా రాయబారితో నరేంద్ర మోడి

(ఈ ఆర్టికల్ గత సంవత్సరం మార్చి నెలలో ఇదే బ్లాగ్ లో ప్రచురించబడింది. బ్లాగ్ ప్రారంభంలో రాసినందున పెద్దగా పాఠకుల దృష్టికి రాలేదు. ప్రధాన మంత్రి పదవి కోసం నరేంద్ర మోడి చేస్తున్న ప్రయత్నాలకు ఇంటా బయటా వస్తున్న మద్దతు, పోటీల దృష్ట్యా దీనికి ప్రాధాన్యత కొనసాగుతోంది. అందువలన పునర్ముద్రిస్తున్నాను. -విశేఖర్) 2002 సంవత్సరంలో గోధ్రా రైలు బోగీ దహనం అనంతరం నరేంద్ర మోడి ప్రభుత్వం నాయకత్వంలో ముస్లిం ప్రజలపై సాగించిన నరమేధానికి బాధ్యులైన వారిపై ఏం…

మోడి ప్రతీకార సిద్ధాంతానికి చెంపపెట్టు, నరోడ-పాటియా తీర్పు

గుజరాత్ నరమేధం లో భాగంగా జరిగిన నరోడ-పాటియా హత్యాకాండ కేసులో ప్రత్యేక సెషన్స్ కోర్టు తరతరాలకు నిలిచిపోయే విధంగా అత్యద్భుతమైన తీర్పు ప్రకటించింది. గోధ్రా రైలు దహనానికి హిందువులు ఐచ్ఛికంగా తీసుకున్న ప్రతీకార చర్య ఫలితమే ‘ముస్లింలపై సాగిన నరమేధం’ అని ప్రవచించిన నరేంద్ర మోడి ‘ప్రతీకార సిద్ధాంతానికి’ చెంప పెట్టులాంటి తీర్పు ప్రకటించింది. గుజరాత్ మాజీ మంత్రి మాయా కొడ్నాని, భజరంగ్ దళ్ నాయకుడు బాబూ భజరంగి తదితరులు పన్నిన కుట్ర ఫలితంగానే ‘నరోడ-పాటియా నరమేధం’…

క్లుప్తంగా… 11.05.2012

మోడి నాలుగ్గోడల మధ్య చట్ట వ్యతిరేక ఆదేశాలిస్తే తప్పు కాదు –సిట్ 2010 లో అయిదేళ్లలోపు పిల్లల మరణాలు 16.8 లక్షలు జి8 సమావేశానికి పుటిన్ ఎగనామం, అమెరికాపై నిరసనతోటే స్వలింగ వివాహాలకి ఒబామా ఆమోదం జాతీయం మోడి నాలుగ్గోడల మధ్య చట్ట వ్యతిరేక ఆదేశాలిస్తే తప్పు కాదు –సిట్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి నాలుగు గోడల మధ్య అధికారులకు చట్ట వ్యతిరేక ఆదేశాలిస్తే అది నేరం కాబోదని గుజరాత్ అల్లర్లపై నియమించబడిన ‘స్పెషల్ ఇన్వెస్టివేషన్…

కొత్త వీసా రూల్స్ తో మోడిని రాకుండా చెయ్యండి -బ్రిటన్ మానవ హక్కుల సంస్ధలు

యూరోపియన్ యూనియన్ ప్రతిపాదిస్తున్న కొత్త వీసా నిబంధనలను నరేంద్ర మోడి కి వర్తింపజేసి బ్రిటన్ కి రాకుండా అడ్డుకోవాలని అక్కడి మానవ హక్కుల సంస్ధలు డిమాండ్ చేశాయి. ఇ.యు దేశాలకు చెందని వారు తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడితే వారిని బ్రిటన్ రాకుండా నిషేధించాలని కొత్త నిబంధనను బ్రిటన్ ప్రతిపాదిస్తున్నది. ఈ నిబంధనను మోడీకి వర్తింపజేసి భవిష్యత్తులో ఆయన బ్రిటన్ లో అడుగుపెట్టనివ్వకుండా చేయాలని మానవ హక్కుల గ్రూపులు ఆదివారం డిమాండ్ చేశాయి. నరేంద్ర మోడి…

తీస్తా సెతల్వాద్ పై తప్పుడు కేసు ఆపండి, మోడీ ప్రభుత్వంతో సుప్రీం

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఆధ్వర్యంలో ముస్లిం లపై జరిపిన అమానుష ‘హత్యాకాండ’ లో దోషులకి శిక్ష పడడానికి అలుపెరుగని పోరాటం నిర్వహిస్తున్న తీస్తా సేతల్వాద్ పై మోడీ ప్రభుత్వం పెట్టిన కేసు ‘తప్పుడు కేసు’ అనీ, ‘మానవ హక్కులను’ తీవ్రంగా ఉల్లంఘిస్తున్నదనీ సుప్రీం కోర్టు మరో సారి తేల్చి చెప్పింది. ఆమె పై పెట్టిన ‘తప్పుడు కేసు’ లో జరుపుతున్న పరిశోధనను ఆపేయాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ అటార్నీని కోరింది. అయితే ఇప్పటికే కేసులో చార్జి…

‘ముస్లింల నరమేధం గుజరాత్ అంతర్గత వ్యవహారం’, అమెరికా రాయబారితో నరేంద్ర మోడి – 2

“దీనికి మోడి గుర్రుమంటూ ‘భారత జాతీయ మాన వహక్కుల సంఘం పక్షపాత పూరితమైనది. దాని నిర్ణయాల్లో తీవ్ర తప్పిదాలున్నాయి. అదీ కాక అమెరికా కొద్ది సంఖ్యలో ఉన్న చిన్న చిన్న ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్ధలపైనే ఆధారపడుతోంది. వాటికి వాస్తవ పరిస్ధితులేవీ తెలియదు. పైగా వాటికి స్వార్ధ ప్రయోజనాలున్నాయి. ఏదైమైనా అధికారులు తప్పు చేసినట్లయితే వారిని విచారించి, శిక్షించేందుకు కోర్టులున్నాయి. ముఖ్యమంత్రులు న్యాయ ప్రక్రియల్లో జోక్యం చేసుకోలేరు’ అని సమాధానమిచ్చాడు” అని ఓవెన్ రాశాడు.  కాన్సల్ జనరల్ దానికి…

‘ముస్లింల నరమేధం గుజరాత్ అంతర్గత వ్యవహారం’, అమెరికా రాయబారితో నరేంద్ర మోడి – 1

2002 సంవత్సరంలో గోధ్రా రైలు బోగీ దహనం అనంతరం నరేంద్ర మోడి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వంలో ముస్లిం ప్రజలపై సాగించిన నరమేధానికి బాధ్యులైన వారిపై ఏం చర్య తీసుకున్నారు అనడిగిన అమెరికా రాయబారి ప్రశ్నకు కోపంతో, “అది గుజరాత్ అంతర్గత వ్యవహారం. ఆ విషయం గురించి ప్రశ్నించే అధికారం అమెరికాకు లేదు” అని నరేంద్ర మోడి హుంకరించిన విషయం అమెరికా రాయబారి రాసిన కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. ఇండియాలో పని చేసిన అమెరికా రాయబారులు అమెరికా…