నరేంద్ర మోడి కి ఊరట?
గుజరాత్ మత మారణకాండలో ‘హిందూ మూకల’ దాడిలో హత్యకు గురైన కాంగ్రెస్ ఎం.పి ఎహ్సాన్ జాఫ్రీ కేసులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఊరట లభించినట్లు తెలుస్తోంది. మోడి తో పాటు మరో అరవై మందిపైన ‘విచారించదగిన సాక్ష్యాలు’ ఏవీ లభించలేదని సుప్రీం కోర్టు నియమించిన ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ తన అంతిమ నివేదికలో తెలిపినట్లుగా, విశ్వసనీయ వర్గాలను’ ఉటంకిస్తూ ‘ఎన్.డి.టి.వి’ తెలిపింది. ముస్లిం ప్రజలపై మారణ కాండకు పూనుకున్న హిందూ మూకలను చూసీ చూడనట్లు వదిలివేయాలంటూ…