కోర్టు ధిక్కారం: కొత్త ప్రధానినీ వదలని పాక్ సుప్రీం కోర్టు

పాకిస్ధాన్ దేశ అత్యున్నత రాజ్యాంగ నాయకుడిపై అక్కడి సుప్రీం కోర్టు రెండో సారి ‘కోర్టు ధిక్కారం’ కేసు కింద విచారణ జరపడానికి ఉద్యుక్తం అవుతోంది. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడన్న నేర నిర్ధారణ చేసి మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ ని పదవీ భ్రష్టుడిని చేసిన పాక్ సుప్రీం కోర్టు, సరిగ్గా అవే కారణాలతో ఆ తర్వాతి ప్రధాని రాజా పర్వేజ్ అష్రాఫ్ పై కూడా చర్యలు మొదలు పెట్టింది. పాకిస్ధాన్ అధ్యక్షుడు ఆసిఫ్ ఆలీ జర్దారీ…

‘కోర్టు ధిక్కారం’ కేసులో పాక్ ప్రధాని దోషి, 30 సెకన్లు జైలు

పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ పై ‘కోర్టు ధిక్కారం’ నేరం రుజువయిందని పాకిస్ధాన్ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. నేరం రుజువయినప్పటికీ ‘సంకేతాత్మక’ శిక్షతో ప్రధానిని కోర్టు వదిలిపెట్టింది. ఆయనపై జైలు శిక్ష గానీ, మరొక శిక్షగానీ విధిస్తున్నట్లు కోర్టు ప్రకటించలేదు. గిలానీ ప్రధాని పదవికి వచ్చిన ముప్పేమీ లేదని కూడా తెలుస్తోంది. మాజీ మిలట్రీ పాలకుడు ముషార్రఫ్ పాలనలో అధ్యక్షుడు జర్దారీతో పాటు అనేకమంది రాజకీయ నాయకులపై ఉన్న అవినీతి కేసుల్లో ముషార్రఫ్ క్షమా…