చవకబారు వాగుడు -ది హిందు ఎడిటోరియల్

[బి.జె.పి పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్రాల నేతలు తమ చవకబారు భావజాలాన్ని నిస్సిగ్గుగా ఆరబెట్టుకోవడం కొనసాగుతూనే ఉంది. రాజీవ్ గాంధీ తెల్లతోలు మహిళకు బదులు నైజీరియా మహిళను పెళ్లి చేసుకుని ఉంటే ఆమెను నాయకురాలిగా కాంగ్రెస్ నేతలు అంగీకరించి ఉండేవారా అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశ్నించగా, ఆందోళనలో ఉన్న నర్సులు తమ ఆందోళనను విరమించకపోతే వారి చర్మం నల్లబడి మంచి భర్తల్ని వెతుక్కోవడం కష్టమై పోతుందని గోవా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మొన్నటివరకు ఇలాంటి…