రైతు నెత్తిన పిడుగు -కత్తిరింపు

దళారులకు, మిల్లర్లకు లాభం చేకూర్చుతూ కేంద్ర ప్రభుత్వం చాప కింద నీరులా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. గిట్టుబాటు ధరలకోసం ఆందోళన చేస్తున్న రైతుల సమస్యలను ఆలకించడం మాని వారి డిమాండ్ కు సరిగ్గా వ్యతిరేక నిర్ణయాన్ని చేసి రాష్ట్రాలకు సమాచారం పంపింది. గిట్టుబాటు ధరకు బదులుగా బోనస్ చెల్లిస్తున్న రాష్ట్రాలు అలా చెల్లించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సబ్సిడీ భారాన్ని తగ్గించుకునే పేరుతో ఈ నిర్ణయాన్ని చేసింది. “మతిమాలిన పాపులిస్టు విధానాలను ఒప్పుకోము” అని…