గాలికి బెయిలు కేసు: సి.బి.ఐ రాష్ట్ర వ్యాపిత దాడులు

రు. 10 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని ‘గాలి జనార్ధన రెడ్డి’ కి సి.బి.ఐ కోర్టు జడ్జి బెయిల్ మంజూరు చేసిన కేసులో సి.బి.ఐ రాష్ట్ర వ్యాపితంగా దాడులు నిర్వహించినట్లు ‘ది హిందూ’ తెలిపింది. లంచం తీసుకుని బెయిల్ ఇచ్చినందుకు సి.బి.ఐ కేసుల కోసం నియమించబడిన ఫస్ట్ అడిషనల్ స్పెషల్ జడ్జి టి.పట్టాభి రామారావు గురువారం సస్పెన్షన్ కు గురయ్యాడు. హైద్రాబాద్, నాచారంలోని ఒక రౌడీ షీటర్, మరొక రిటైర్డ్ జడ్జిలు గాలి, జడ్జి ల మధ్య ఒప్పందం…

క్లుప్తంగా… 05.05.2012

జాతీయం వేచి చూస్తాం -రాష్ట్రపతి ఎన్నికపై లెఫ్ట్ పార్టీలు రాష్ట్ర పతి ఎన్నికకు సంబంధించి వేచి చూడడానికి నిర్ణయించుకున్నామని లెఫ్ట్ పార్టీలు తెలిపాయి. సి.పి.ఐ, సి.పి.ఎం, ఆర్.ఎస్.పి ఫార్వర్డ్ బ్లాక్ న్యూఢిల్లీలో సమావేశమై మాట్లాడుకున్న అనంతరం తమ నిర్ణయం ప్రకటించాయి. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్.సి.పి పార్టీ మాత్రం ఉప రాష్ట్రపతి ‘హమీద్ అన్సారీ’ కంటే ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ యే తమకు ఆమోదయోగ్యమని ప్రకటించింది. అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ‘సెక్యులర్’ పార్టీల అభిప్రాయం…

‘గాలి’ సొమ్ము లాయర్లకు బహు తీపి

అక్రమ పద్ధతుల్లో సంపాదించిన ‘గాలి’ జనార్ధన రెడ్డి గారి సొమ్ము అంటే బెంగుళూరు లాయర్లకు ఎంత ఇష్టమో బెంగుళూరు కోర్టు వద్ద శుక్రవారం జరిగిన ఘటనలు వెల్లడించాయి. బెంగుళూరు కోర్టు ఆదేశాల మేరకు కోర్టులో విచారణకు హాజరయిన ‘గాలి జనార్ధన రెడ్డి’ ని మీడియా ఫోటోగ్రాఫర్లు ఫోటో తీయకుండా అడ్డుకోవడానికి వారు పెద్ద యుద్ధమే చేశారు. గుంపులు గుంపులు గా మీడియా ఫోటో గ్రాఫర్లను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ తమ వల్ల కాకపోవడంతో వారిపై రాళ్ళ దాడికి కూడా…

అక్రమ మైనింగ్‌పై సి.బి.ఐ కొరడా, గాలి జనార్ధన్, మరొకరి అరెస్టు

గాలి బ్రదర్స్‌లో నాయకత్వ పాత్రలో కనిపించే గాలి జనార్ధన రెడ్డి, ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓ.ఎం.సి) ఎం.డి బి.శ్రీనివాస రెడ్డిలను సి.బి.ఐ సోమవారం అరెస్టు చేసింది. సి.బి.ఐ డెప్యుటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ వి.వి.లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బృందం బళ్ళారి చేరుకుని స్వయంగా గాలి జనార్ధన రెడ్డి, బి.శ్రీనివాస రెడ్డిలను అరెస్టు చేసి రోడ్డు మార్గంలో హైద్రాబాద్ కి తీసుకువచ్చారు. ఇద్దరిని అరెస్టు చేశామని సాయంత్రంలోగా సి.బి.ఐ ప్రత్యేక కోర్టులో హాజరు పరుస్తామనీ సి.బి.ఐ ప్రతినిదులు తెలిపారు. గాలి జనార్ధన…