ఈ జాత్యహంకార దుర్గంధం ఎచటిదంటే గాజావైపు చూపండి! -ఫోటోలు

ప్రకృతి శక్తులకు మాత్రమే సాధ్యమైన ఉన్మత్త విధ్వంసం ఇది. ఆధునిక సాంకేతికాభివృద్ధి శక్తులను కూరి పసిప్రాణాల్ని పేల్చేస్తున్న చమురు దాహపు వినాశనమిది. నెలరోజుల నిర్విరామ డాలర్ల దాడుల్లో మిగిలిన మానవత్వపు శిధిలాలివి. అత్యంత ప్రాచీన పాలస్తీనా జాతి గుండె కోత ఇది.  చెట్టూ-పుట్టా, గుడిసే-మేడా  తేడా లేకుండా దివిసీమనంతటినీ ముంచేసిన ప్రళయ భీకర పెను తుఫానును చూసి గుండెలు బాదుకున్నాం. ఉప్పు సముద్రాలన్నీ తెచ్చి కుమ్మరించిన హిందూ మహా సముద్రపు సునామీలో వేలమందిని కోల్పోయాం. కట్టుదిట్టమైన ఫుకుషిమా…

లండన్: ఇజ్రాయెల్ వ్యతిరేక భారీ ప్రదర్శనలు

‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అని సామెత. ఈ సామెత తమ విషయంలో నిజం కాదని లండనర్లు నిరూపిస్తున్నారు. బ్రిటన్ ప్రభుత్వం, బ్రిటిష్ పత్రికలు అంతా కట్టగట్టుకుని ఇజ్రాయెల్ స్వయం రక్షణ హక్కు కోసం పాటు పడుతుంటే, ఇజ్రాయెల్ అమానవీయ దాడులు జరిపే హక్కులను నిలదీస్తూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. లండనర్ల నిరసనలను లండన్ కేంద్రంగా నడిచే అంతర్జాతీయ కార్పొరేట్ పత్రికలు సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. ‘పాలస్తీనియన్ సాలిడారిటీ కాంపెయిన్’, ‘స్టాప్…

ఇజ్రాయెల్ దుర్మార్గానికి ప్రత్యక్ష సాక్ష్యాలు -ఫోటోలు

మధ్య ప్రాచ్యంలో ‘ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్’ హత్యలు ఆటంకం లేకుడా కొనసాగుతున్నాయి. పాలస్తీనా ప్రజల మరణాలు 700 దాటిపోయింది. ‘రక్షణ పొందే హక్కు’ ఇజ్రాయెల్ కు ఉందన్న పేరుతో అమెరికా అంతర్జాతీయంగా ఐరాస భద్రతా సమితి తదితర వేదికలపై మారణకాండను వెనకేసుకొస్తుండగా ఇజ్రాయెల్ దుర్మార్గాలు వెల్లడి కాకుండా ఉండడానికి పశ్చిమ పత్రికలు శతధా సహకరిస్తున్నాయి. ‘ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్’ అంటే? ఎడ్జ్ అంటే అంచు అన్న సంగతి తెలిసిందే. గాజా భూఖండం మధ్యధరా సముద్రం అంచున ఉన్న…

ఈజిప్టు ప్రభుత్వ మార్పిడితో పాలస్తీనా మూల్యం

ప్రపంచంలో అత్యంత అస్ధిర (volatile) ప్రాంతం మధ్య ప్రాచ్యం. అరబ్ వసంతం పేరుతో గత మూడేళ్లుగా అక్కడ జరుగుతున్న పరిణామాలు ఈ సంగతిని మరోసారి నిరూపించాయి. మధ్య ప్రాచ్యంలో కూడా అత్యంత భావోద్వేగ ప్రేరక సమస్య పాలస్తీనా సమస్య. ప్రపంచ వ్యాపితంగా విస్తరించిన క్రైస్తవ, ఇస్లాం, యూదు మతాలకు జన్మస్ధలం అయిన పాలస్తీనా సమస్య సహజంగానే అనేక ప్రపంచ రాజకీయాలకు కేంద్రంగా కొనసాగుతోంది. ఫలితంగా పాలస్తీనాలో జరిగే పరిణామాలు ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తుండగా, మధ్య ప్రాచ్యంలోని…

ముగ్గురు ‘గాజా’ పౌరులను కాల్చి చంపిన ఇజ్రాయెల్ సైనికులు

కొత్త సంవత్సరంలో ఇజ్రాయెల్ సైనికులు తమ హంతక చర్యలను ప్రారంభించారు. గాజాతో ఉన్న సరిహద్దు వద్ద సముద్రపు గవ్వలను ఏరుకొంటున్న ముగ్గురు పాలస్తీనా యువకులను ఇజ్రాయిల్ సైనికులు అమానుషంగా కాల్చి చంపారు. సరిహద్దు వద్ద మానవ నిషిద్ద ప్రాంతంలో పాలస్తీనీయులు పేలుడు పదార్ధాలు ఉంచుతున్నందున ఇజ్రాయిల్ సైనికులు వారిపైన కాల్పులు జరిపారని ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. గాజాలో అధికారంలో ఉన్న ‘హమాస్’ పోరాట సంస్ధ మరణించిన వారు తమ కార్యకర్తలని ప్రకటించ లేదు. వారి కార్యకర్తలు ఏదైనా…