ఉగ్ర సొరంగాలు కావవి జీవన తరంగాలు -ఫోటోలు
బంతిని గోడకేసి ఎంత బలంగా కొడితే అంతే బలంతో అది వెనక్కి తిరిగి వస్తుంది. బెలూన్ నిండా గాలి నింపి ఒత్తితే, బలహీన చోట్లు చూసుకుని బెలూన్ ను బద్దలు కొట్టుకుంటూ గాలి బైటపడుతుంది. ఇది ప్రకృతి సూత్రం. సామాజిక సూత్రం కూడా. సమకాలీన ప్రపంచంలో అందుకు ప్రబల సాక్ష్యం గాజా ప్రజల జీవ నాడులుగా మారిన సో కాల్డ్ ‘ఉగ్ర సొరంగాలు.’ సెక్యులర్ నేత యాసర్ అరాఫత్ బ్రతికి ఉన్నంత వరకూ పాలస్తీనా ప్రజల పోరాటం…