ఇజ్రాయెల్ ఓ టెర్రరిస్టు రాజ్యం -బొలీవియా

‘మొనగాడు’ అందామా! గంజాయి వనంలో తులసి మొక్క’ అందామా! మానవత్వం ఇంకా బతికే ఉంది’ అనొచ్చా! ‘సాహస బొలీవియా’ అని మెచ్చుకుని అటువంటి ప్రభుత్వం మనకు లేనందుకు సిగ్గుపడదామా? గాజా పాఠశాలలో ఐరాస నిర్వహిస్తున్న శరణార్ధి శిబిరంపై నిద్రిస్తున్న పిల్లలపై బాంబులు కురిపించి చంపేసిన ఇజ్రాయెల్ దుర్మార్గాన్ని కనీసం ఖండించడానికి మన కేంద్ర ప్రభుత్వానికి ఇంతవరకు నోరు పెగల్లేదు. దాదాపు 1400 మంది నిరాయుధ అమాయక పౌరుల పైన అత్యాధునిక ట్యాంకులు, జెట్ ఫైటర్లు, గన్ బోట్లతో…

గాజా వార్: ఐరాస స్కూళ్ళు, శిబిరాలపై దాడులు

ఇజ్రాయెల్ జాత్యహంకార రాజ్యం ఐరాస నిర్వహిస్తున్న పాఠశాలలు, శరణార్ధి శిబిరాలను సైతం వదలడం లేదు. అత్యంత ఆధునిక జెట్ ఫైటర్ లు, గన్ బోట్లు, ట్యాంకులు వినియోగిస్తూ సమస్త నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం ఈ రోజు జరిపిన ట్యాంకు దాడుల్లో ఐరాస పాఠశాలను లక్ష్యంగా చేసుకోవడంతో ఒకేసారి 20 మంది మరణించారు. మరణించినవారిలో ఒక పసికూన కూడా ఉన్నదని రాయిటర్స్ తెలిపింది. ఐరాసకు చెందిన సహాయ పనుల ఏజన్సీ (United Nations Relief and…

ఇజ్రాయెల్ వ్యతిరేక వార్త, అమెరికా విలేఖరుల తొలగింపు

గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న అమానుష యుద్ధానికి సంబంధించి వాస్తవ వార్త ప్రసారం చేసినందుకు పశ్చిమ వార్తా సంస్ధలు తమ విలేఖరులను తప్పించాయి. ఒక వార్తా సంస్ధ విలేఖరిని ఇంటికే పంపిస్తే మరో వార్తా సంస్ధ న్యూస్ ప్రజెంటర్ ను తప్పించి ఇతర బాధ్యతలకు బదిలీ చేసింది. ఆ రెండు వార్తా సంస్ధలు సాదా సీదావి కావు. భారీ కార్పొరేట్ వార్తా సంస్ధలు. ప్రజాస్వామ్య సంస్ధాపన కోసం అమెరికా చేసే అడ్డపైన పనుల్ని నెత్తిన పెట్టుకుని మోసే కంపెనీలు.…

అసమానుల తగాదా: నిస్పక్షపాతమూ పక్షపాతమే -కార్టూన్

ఓహ్… ఇద్దరూ మనకు మిత్రులే కదా! *** పోటీ అన్నది ఎప్పుడూ సమానుల మధ్య జరగడమే న్యాయం. ఆటలో ఒక పక్షం తొండాట ఆడుతున్నారని తెలిసీ నిస్పక్షపాతం అంటూ గిరి గీసుకు కూర్చుంటే అది చివరికి తొండాటకు మద్దతుగా తేలుతుంది. ఇప్పుడు గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణ హోమం విషయంలో భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఇలాగే ఉంది. ఇజ్రాయెల్ అన్ని విధాలుగా బలీయమైన రాజ్యం. అనేక దశాబ్దాలుగా అమెరికా, ఐరోపాల పోషణలో ఉన్న ఇజ్రాయెల్ మధ్య…

ఇజ్రాయెల్ దౌష్ట్యం: రాతి గుండెలైతేనే ఈ ఫోటోలు చూడండి!

ఎల్లలు లేని దౌష్ట్యం ఇజ్రాయెల్ సొంతం. అందుకు ఈ ఫోటోలే సాక్ష్యం. బుధవారం నాటికి ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన గాజన్ల సంఖ్య 213. దాడులు ఇంకా కొనసాగుతున్నందున ఈ సంఖ్య పెరగడానికి ఎన్నో గంటలు పట్టదు. ఇజ్రాయెల్ దాడులకు పశ్చిమ పత్రికలు ఎప్పుడూ గాజా యుద్ధం అనే పేర్కొంటాయి. తద్వారా ఇజ్రాయెల్ తాను దురాక్రమించిన ప్రాంతాలపై విధ్వంశకరమైన దాడులకు తాగబడుతున్న సంగతి పేరులో దొర్లకుండా జాగ్రత్త పడతాయి. ఈ సో కాల్డ్ ‘గాజా యుద్ధం’ ఫోటోలను దాదాపు…

జాత్యహంకార నీడలో నిలువెల్లా గాయాల గాజా -ఫోటోలు

గాజా ప్రజ మరోసారి రక్తం ఓడుతోంది. యూదు జాత్యహంకారం విసురుతున్న ఆధునిక క్షిపణి పంజా దెబ్బలకు అతి పెద్ద బహిరంగ జైలుగా ప్రసిద్ధి గాంచిన గాజా నిలువెల్లా గాయాలతో నిస్సహాయగా నిలిచి ప్రపంచ వ్యవస్ధల చేతగానితనాన్ని నిలదీసి ప్రశ్నిస్తోంది. పౌరుల ఆవాసాలనే యుద్ధ క్షేత్రాలుగా మిగిల్చిన దశాబ్దాల ఇజ్రాయెల్ దురాక్రమణ ముందు తానే దురాక్రమణదారుగా చిత్రీకరించబడుతున్న వైనాన్ని నివ్వెరపోయి చూస్తోంది. తోడేలు న్యాయానికి గొర్రెలను అప్పగిస్తున్న పులుల ఆటవిక న్యాయానికి సాక్షిగా నిలబడి సో కాల్డ్ ప్రజాస్వామిక…

పాలస్తీనాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ హంతక దాడులు

ఇజ్రాయెల్ వరుసగా మూడో రోజు కూడా గాజా పై దాడి చేసి 7 గురు అమాయక పౌరులను బలి తీసుకుంది. శనివారం గాజాపై వైమానిక దాడులు జరిపి పది మందిని చంపిన ఇజ్రాయెల్, ఆదివారం మళ్ళీ అత్యాధునిక విమానాలతో జరిపిన బాంబు దాడుల్లో మరో 7 గురుని చంపేసింది. చనిపోయినవారిలో 12 యేళ్ళ బాలుడు కూడా ఉన్నాడు. గత కొద్ది నెలలుగా చెదురు ముదురు ఘటనలు తప్ప ప్రశాంతంగా ఉన్న వాతావరణం, ముఖ్యమైన పాలస్తీనా నాయకుడిని ఇజ్రాయెల్…

గాజా సరిహద్దును శాశ్వతంగా తెరవడానికి నిర్ణయించిన ఈజిప్టు

అరబ్ ప్రజా ఉద్యమాలకు మరో బోనస్. ఈజిప్టులోని మధ్యంతర ప్రభుత్వం గాజాతో ఉన్న రఫా సరిహద్దును శాశ్వత ప్రాతిపదికన తెరిచి ఉంచడానికి నిర్ణయించింది. పాలస్తీనా వైరి పార్టీల మధ్య ఊహించని విధంగా ఒప్పందం కుదరడానికి సహకరించిన ఈజిప్టు ప్రభుత్వం గాజా సరిహద్దును తెరవాలని నిర్ణయించడం అభినందనీయం. అయితే అరబ్ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌తో కొనసాగుతున్న (అ)శాంతి ఒప్పందం కూడా రద్ధు చేసుకుంటే ఈజిప్టు ప్రభుత్వానికి ప్రపంచవ్యాపితంగా ప్రశంసలు అందుతాయి. కానీ అమెరికానుండి సంవత్సరానికి 1 బిలియన్…

ఇజ్రాయెల్ వ్యతిరేక తీర్మానానికి మద్దతిచ్చిన ఇండియాపై అమెరికా ఆగ్రహం -వికీలీక్స్

ఇండియాపై అమెరికా కర్రపెత్తనానికి ఇది మరో ఋజువు. ఈ సారి అమెరికా చెప్పినట్టు ఇండియా వినకపోవడమే వార్త. అయితే అందులో ఇండియా పాలక వర్గాల ప్రయోజనం ఇమిడి ఉండటంతో అమెరికా గీసిన గీత దాటడానికి ఇండియా పాలకులు ధైర్యం చేశారు. డిసెంబరు 2008లో ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతం గాజా పై దాడి చేసి అక్కడి పౌరులను చంపడాన్ని ఖండిస్తూ చేసిన తీర్మానానికి ఇండియా మద్దతు తెలిపింది. ఓటింగ్ కుముందు అమెరికా లాబీయింగ్ ను ఇండియా వ్యతిరేకించిన విషయాన్ని…

జెరూసలేంలో సూట్ కేసు బాంబు పేలుడు, ఒకరి మృతి

పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య తాజాగా ఘర్షణలు రాజుకుంటున్నాయి. మంగళవారం ఇజ్రాయెల్ సైనిక విమానం జరిపిన దాడిలో  పాలస్తీనా మిలిటెంట్ల రాకేట్ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగిన తర్వాత పశ్చిమ జెరూసలేం లోని ఒక బస్ స్టేషన్ లో ఉంచిన సూట్ కేసు బాంబు పేలింది. ఇద్దరు పిల్లలతో సహా 8 మంది పాలస్తీనీయులు ఈ దాడిలో చనిపోయారు. ఇజ్రాయెల్ వైమానిక దాడికి ప్రతీకార చర్యగా గాజాలోని ఇస్లామిక్ జీహాద్ సంస్ధ రెండు రాకెట్లను ఇజ్రాయెల్…