మోడి సుపరిపాలనా సూత్రాలు -కార్టూన్

“యెస్, సర్…” “గవర్నర్లు…” “ఎన్.జి.ఓ లు…” “… ఇంకా, హిందీలో రాయాలి!” “మరిన్ని స్టిక్-ఆన్ నోట్ లా, సర్?” “గరిష్ట (సు)పరిపాలన కోసం కాసిన్ని చిన్న చిన్న సవరణలు… అంతే…” *** ప్రధాని నరేంద్ర మోడి ఎన్నికల నినాదాల్లో ‘సుపరిపాలన’ (Good Governance) ఒకటి. యు.పి.ఏ ప్రభుత్వం మా చెడ్డదనీ తాను ప్రధాని అయ్యాక దేశ ప్రజలకు ‘సుపరిపాలన’ అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తానని ఆయన ప్రచారం చేశారు. గుజరాత్ ప్రజలకు రుచి చూపించిన సుపరిపాలన…

కాంగ్రెస్ గవర్నర్ల గెంటివేత -కార్టూన్

“రాజీనామా? అబ్బే కాదు. గెంటేశారు!!” *** కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పాత ప్రభుత్వం తాలూకు వాసనలను వదిలించుకోవాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల గవర్నర్ లను మార్చడానికి మోడి ప్రభుత్వం పావులు కదుపుతోంది. అయితే కొందరు గవర్నర్ లు అందుకు సహకరించడానికి సిద్ధంగా లేరు. దానితో బి.జె.పి మండిపడుతోంది. ముఖ్యంగా కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహా రాష్ట్ర రాష్ట్రాల గవర్నర్లు తమకు రాజీనామా చేసే ఉద్దేశ్యం ఏమీ లేదని స్పష్టం చేయడంతో…