గల్ఫ్ లో భారత ప్రయోజనాలకు ‘అబ్రహాం ఎకార్డ్స్’ గండం!

(రెండవ భాగం తర్వాత….) సైప్రస్ సమావేశంలో పాల్గొన్న నాలుగు దేశాలకూ టర్కీతో విభేదాలు ఉన్నాయి. యూ‌ఏ‌ఈ, ఇజ్రాయెల్ పాల్గొన్న ప్రతి సమావేశంలో ఇరాన్ గురించి తప్పనిసరిగా చర్చ జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో టర్కీ విస్తరణ వాదంతో దూకుడుగా వ్యవహరిస్తుండడంతో ఇవి టర్కీతో మరింత జాగ్రత్త పడుతున్నాయి. ఇక టర్కీ దూకుడు అమెరికాకు అసలే గిట్టదు. సైనిక కుట్ర ద్వారా ఎర్దోగన్ ను పదవీచ్యుతుడిని చేసేందుకు జులై 2016లో విఫలయత్నం చేసింది. రష్యా గూఢచార సమాచారంతో ఎర్డోగన్…

మీరు లిబియన్లపై బాంబులేసుకొండి, మేం మా ప్రజల్ని చంపుకుంటాం -అమెరికా, సౌదీఅరేబియాల అనైతిక ఒప్పందం

ఒకరి దారుణాలను మరొకరు ఖండించుకోకుండా అమెరికా, సౌదీ అరేబియాల మధ్య అనైతిక ఒప్పందం సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజానికి ఈ నిజం అరబ్ ప్రపంచానికి చెందిన వార్తా సంస్ధలకు ఎప్పుడో ఉప్పందింది. అరబ్, ముస్లిం ప్రపంచంలోని ప్రముఖ బ్లాగర్లు బైట పెట్టే వరకూ ఈ దారుణం ప్రపంచానికి తెలియలేదు. లిబియా పౌరులను గడ్డాఫీ సైన్యాలు చంపుతున్నాయంటూ కాకి గోల చేస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు తదితర పశ్చిమ దేశాలు బహ్రెయిన్, యెమెన్ ల ప్రభుత్వాధిపతులు అక్కడ…