పఠాన్ కోట్ దాడి: మెచ్చుకున్నోళ్లు ఒక్కరూ లేరు!

పఠాన్ కోట్ దాడి పట్ల కేంద్ర ప్రభుత్వం, భద్రతా బలగాలు స్పందించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యున్నత స్ధాయి శిక్షణ పొందిన ఏడుగురు  భద్రతా సిబ్బందిని పోగొట్టుకుని కూడా నాలుగు రోజుల పాటు ఆపరేషన్ కొనసాగడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదుల దాడి మొదలుకుని భద్రతా బలగాలను తరలించిన తీరు, ఆపరేషన్ కొనసాగుతుండగా మంత్రులు, నేతలు చేసిన ప్రకటనలు, ఏం జరుగుతున్నదో సాక్షాత్తు హోమ్ మంత్రికి కూడా తెలియని అయోమయం, మరణాల సంఖ్య, ఉగ్రవాదుల సంఖ్య…