గదిలో ఏనుగు, పాక్ మిలట్రీ -కార్టూన్

పాకిస్ధాన్ లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం (ప్రజల ప్రజాస్వామ్యం కాదు) కూడా ఓ ఎండమావిగా మారిపోయింది. ఎన్నికలు జరిగి పౌర ప్రభుత్వం ఏర్పడి అది కుదురుకునే లోపుగా అక్కడి మిలట్రీ జోక్యం చేసుకోవడం, ఎన్నికయిన ప్రభుత్వాల్ని కూల్చివేయడం ఒక పరిపాటి అయింది. పాలక వర్గాల మధ్య కుమ్ములాటలే ఈ ప్రహసనానికి మూల కారణం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఎన్నికల్లో మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. కానీ నవాజ్ షరీఫ్ కీ, అక్కడి మిలట్రీకి…

మబ్బులు తొలగును, అసలు తెలియును -కార్టూన్

“…ప్రారంభోల్లాస భ్రాంతి సర్దుకునే కొలదీ ఆర్ధిక స్ధితిగతులలు తన అసలు రూపాన్ని వ్యక్తం చేసుకుంటుంది..”  (ఆ రూపమే గదిలో ఏనుగు) మోడి: మనం మిత్రులమే కదా? *** స్వతంత్ర  భారత దేశ చరిత్ర లోనే పూర్తి మెజారిటీ సాధించిన మొట్ట మొదటి కాంగ్రెసేతర పార్టీగా బి.జె.పి మన్ననలు అందుకుంటోంది. బి.జె.పికి ఆ ఖ్యాతి దక్కించిన మహోన్నత నేతగా నరేంద్ర మోడి ప్రశంసలు పొందుతున్నారు. నిన్నటిదాకా ‘దూరం, దూరం’ అంటూ అస్పృశ్యత అమలు చేసిన బ్రిటన్, అమెరికాలు ‘రండి,…

అణు పరిహార చట్టం: గదిలో ఏనుగు! -కార్టూన్

“Elephant in the room” అనేది ఆంగ్లంలో ఒక సామెత. ‘చర్చించడానికి, మాట్లాడుకోవడానికి ఇష్టం లేని సమస్య, కానీ విస్మరించలేని సమస్య’ ను సూచించడానికి ఈ ‘గదిలో ఏనుగు’ సామెతను వాడతారు. భారత అణు పరిహార చట్టం విదేశీ కంపెనీలకు ఈ సామెతను గుర్తుకు తెస్తోంది(ట)! గదిలో ఏనుగు ఉన్నపుడు, భారీ ఆకారంతో ఉంటుంది గనక ఆ గదిలో ఉన్నవారికి ఒక సమస్యగా ఉంటుంది. కానీ దాన్ని వదిలించుకోడానికి వారికి మార్గం లేని పరిస్ధితి వారికి ఉంటుంది.…