గడ్డాఫీ, లిబియాల గురించి ప్రపంచానికి తెలియని నిజాలు

గడ్డాఫీ పాలనలో లిబియా ప్రజలు నిశ్చింతగా గడిపారు. అటువంటి గడ్డాఫీని చంపి అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాల ధనికుల ప్రయోజనాలను నెరవేరుస్తూ, వారి అడుగులకు మడుగులొత్తే తొత్తు పాలకులు లిబియాని ఏలడానికి సిద్దంగా ఉన్నారు. గడ్డాఫీ పాలనలో లిబియా ప్రజలు ఎన్ని సౌకర్యాలు అనుభవించారో తెలుసుకుంటే వారిపైన అసూయ కలుగుతుంది. లిబియాలో విద్యుత్ వాడుకున్నందుకు నెల నెలా బిల్లులు రావు. దేశ ప్రజలందరికీ విద్యుత్ ఉచితం. (కంపెనీలకు నష్టం వస్తుందని చెప్పి ప్రజలపై బాదే అధికారులు అక్కడ…