గౌరవం పేరుతో జరిగే నేరం -ది హిందు ఎడిట్

(ది హిందు ఎడిటోరియల్ -22/11/2014- అనువాదం. -విశేఖర్) ____________   గౌరవాన్ని మోహరించడం అన్నది మహిళలపై అమలయ్యే సామాజిక నియంత్రణకు ఒక తీవ్ర రూపం. అది శరీరాన్ని క్రమశిక్షణలో ఉంచే ప్రక్రియ. కుటుంబాలు, సామాజిక సమూహాలు, ఒకరి ‘గౌరవహీన’ చర్యలపై పుకార్లమారి పొరుగువారి గూఢచర్యం – ఎవరేమి ధరిస్తున్నారు, ఎవరేమి మాట్లాడుతున్నారు, ఎవరేమి ఎగవేస్తున్నారు, ఎవరేమి అవలంబిస్తున్నారు- అన్నింటినీ ఆ తీక్షణ చూపుల ద్వారా పటం గీసేస్తారు. ఏదో ఒక హింసాత్మక రూపంతో కూడిన పితృస్వామిక ఆదేశ…

ప్రభుత్వాలు కూడా ఖాఫ్ పంచాయితీలేనా? -కార్టూన్

“నిన్ను ఇప్పటికిప్పుడే బదిలీ చేసేశాం. ‘అవినీతి’ కులాన్ని నువ్వు గాయపరిచావు” వాద్రా భూ కుంభకోణంపై విచారణకు ఆదేశించినందుకు హర్యానా లాండ్ రిజిష్ట్రేషన్ ఉన్నతాధికారి ‘అశోక్ ఖేమ్కా’ ను ఆ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. దానికి హర్యానా హై కోర్టు ఇచ్చిన ఆదేశాలే కారణమని ప్రభుత్వం ఇప్పుడు బొంకుతోంది. నాలుగు రోజుల క్రితం అధికారుల బదిలీలు రాష్ట్ర ప్రభుత్వ ‘విచక్షణాధికార హక్కు’ అని చెప్పి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అశోక్ బదిలీని సమర్ధించుకున్నాడు. బదిలీ పై విమర్శలు…

ప్రేమ వద్దు! బైటికే రావద్దు!! మహిళలకు యు.పి పంచాయితీ ఫత్వా

ప్రేమ పెళ్ళిళ్ళు నిషేధిస్తూ ఉత్తర ప్రదేశ్ లోని భాగ్ పట్ జిల్లా అసారా గ్రామ పంచాయితీ ఫత్వా జారీ చేసింది. 40 యేళ్ళ లోపు మహిళలు ఒంటరిగా మార్కెట్ కి కూడా వెళ్లరాదంటూ నిషేధం విధించింది. ఆడ పిల్లలు రోడ్లపైన మొబైల్ ఫోన్లు ఉపయోగించకూడాన్నీ నిషేధించింది. ఆనక తమది ఫత్వా కాదని 36 కులాల వాళ్ళం కూర్చుని చర్చించి తీసుకున్న నిర్ణయమని పంచాయితీ పెద్దలు తమ రూలింగ్ ని సమర్ధించుకున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ భాగ్ పట్…