క్లుప్తంగా… 29.04.2012

జాతీయం ఆఫ్ఘన్ సైనిక ఉపసంహరణతో భారత్ అప్రమత్తం కావాలి ఆఫ్ఘనిస్ధాన్ మత ఛాందస సంస్ధలు భారత్ సరిహద్దుల్లో జమకూడే ప్రమాదం ఉందని భారత సైనికాధికారి ఒకరు హెచ్చరించాడు. కర్ణాకటక లో ఒక కార్యక్రమంలో మాట్లాఆడుతూ ఆయన ఈ హెచ్చరిక చేశాడు. ముఖ్యంగా అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు ఆఫ్ఘనిస్ధాన్ నుండి ఉపసంహరించుకున్నాక ఈ ప్రమాదం తలెట్టవచ్చని ఆయన తెలిపాడు. జమాత్ ఉద్-దావా నాయకుడు, ముంబయ్ దాడులకు బాధ్యుడుగా అనుమానిస్తున్న హఫీజ్ సయీద్ ఇటీవల చేసిన ప్రకటనను ఆయన…

క్లుప్తంగా… 28.04.2012

జాతీయం సోనియా సభలో నల్లజెండా కర్ణాటక పర్యటిస్తున్న సోనియా గాంధీకి ఒక మహిళ నల్ల జెండా చూపి కలకలం రేపింది. పోలీసులు ఆమె పైకి లంఘించి నోరు నొక్కి బైటికి వెళ్లగొట్టారు. తమ కమ్యూనిటీకి ఎస్.సి రిజర్వేషన్లు కల్పించాలని మహిళ డిమాండ్ చేసినట్లు ‘ది హిందూ’ తెలిపింది. కేవలం నల్ల జెండా చూపిస్తేనే మహిళ నోరు నోక్కే పోలీసు చట్టాలు ఏ ప్రజాస్వామ్యానికి ప్రతీకలో సోనియా గాంధీ చెప్పవలసి ఉంది. సిద్దగంగ మఠం వ్యవస్ధాపకుడి 105 వ…

క్లుప్తంగా… 27.04.2012

ఇరాన్ అణు బాంబు కి సాక్ష్యం లేదు –పెనెట్టా ఇరాన్ ‘అణు బాంబు’ నిర్మిస్తోందని ఖచ్చితమైన సాక్ష్యం ఏదీ దొరకలేదని అమెరికా రక్షణ కార్యదర్శి లియోన్ పెనెట్టా అన్నాడని ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలిపింది. “ఇరానియన్లు అణుబాంబు తయారీకి నిర్ణయించినట్లు నిర్ధిష్ట సమాచారం ఏదీ నా వద్ద లేదు” అని పెనెట్టా అన్నాడు. చిలీ రక్షణ మంత్రితో సమావేశం అయిన అనంతరం విలేఖరులతో పెనెట్టా మాట్లాడాడు. ఇరాన్ అణు బాంబుకి ప్రయత్నిస్తున్నదంటూ అమెరికా, యూరప్ లు ఒత్తిడి…

క్లుప్తంగా… 26.04.2012

అంతర్జాతీయం హెచ్.ఎస్.బి.సి బ్యాంకు యు.కె శాఖల్లో 2,200 ఉద్యోగాలు రద్దు ఇంగ్లాండులో హెచ్.ఎస్.బి.సి బ్యాంకు మరో 2,200 ఉద్యోగాలు రద్దు చేసింది. వాస్తవంగా రద్దు చేసినవి 3,100 ఉద్యోగాలు కాగా, కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు పోను నికరంగా 2,217 ఉద్యోగాలు రద్దు చేసినట్లయింది. ఖర్చు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగాలు రద్దు చేస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. హెచ్.ఎస్.బి.సి గత సంవత్సరం 7,000 ఉద్యోగాలు రద్దు చేసింది. 2013 లోపు ప్రపంచ వ్యాపితంగా 30,000 ఉద్యోగాలు రద్దు చేస్తానని…

News in brief

కొత్త కేటగిరీ – ‘క్లుప్తంగా’

ఏప్రిల్ 24 తేదీ నుండి ‘క్లుప్తంగా’ పేరుతో కొత్త కేటగిరీ ప్రారంభించాను. ప్రతిరోజూ “క్లుప్తంగా… ‘తేదీ’” హెడ్డింగ్ తో ఒక పోస్టు రాయడం జరుగుతుంది. ఈ పోస్టులో ఆ తేదీన వెలువడ్డ వార్తలలో కొన్ని ముఖ్యమైనవి ఎంచుకుని క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఇలాంటి పోస్టు ఒకటి ప్రతి రోజూ రాయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నప్పటికీ ఎలా రాయాలో తెలియక మొదలు పెట్టలేదు. ఆ విధంగా ప్రతిరోజూ రాసిన క్లుప్త వార్తల పోస్టులకు హోం పేజీ నుండి లింక్…

క్లుప్తంగా… 25.04.2012

జాతీయం   మరోసారి రంగం మీదికి బోఫోర్స్ బోఫోర్స్ మరోసారి పతాక శీర్షికలకు ఎక్కింది. బోఫోర్స్ కుంభ కోణం బయటపడ్డ రోజుల్లో స్వీడన్ లో విచారణ నిర్వచించిన పోలీసు అధికారి తాజాగా సరికొత్త ఆరోపణలతో నోరు విప్పడంతో మంత్రులు, ప్రతిపక్షాలు వాదోపవాదాలు ప్రారంభించారు. బోఫోర్స్ కుంభకోణంపై జరిగిన విచారణను అడ్డుకోవడంలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సఫలమైనాడని స్వీడన్ పోలీసు అధికారి స్టెన్ లిండ్ స్ట్రామ్ ప్రకటించి సంచలనం సృష్టించాడు. గాంధీల పాత్ర గురించి సాక్ష్యాలు లేవుగానీ…

క్లుప్తంగా… 24.04.2012

జాతీయం జగన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు జగన్ అవినీతి ఆస్తుల కేసులో సి.బి.ఐ ఉచ్చు బిగిస్తున్నదని ఫస్ట్ పోస్ట్ తెలిపింది. సెక్షన్ 164 కింద సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడం ద్వారా పకడ్బందీగా కేసు విచారణ సాగిస్తునట్లు వెల్లడించింది. మేజిస్ట్రేట్ సమక్షంలో నమోదు చేసిన సాక్షుల వాంగ్మూలాలను సాక్ష్యాలుగా కోర్టు పరిగణిస్తుందనీ, వాటిని ఆ తర్వాత సాక్షులు వెనక్కి తీసుకోవడానికి లేదనీ ఆ పత్రిక తెలిపింది. అలాంటి సాక్ష్యాలను రహస్యంగా ఉంచుతూ కింది కోర్టులో అప్పుడే వాటిని…