ఎస్ & పి, అమెరికా క్రెడిట్ రేటింగ్‌ తగ్గింపు, తెలుసుకోదగిన కొన్ని అంశాలు -2

స్పెక్యులేటివ్ షేర్లను ఆధారం చేసుకుని అనేక షేర్ల కుంభకోణాలు జరిగాయి. భారత దేశంలో హర్షద్ మెహతా కుంభకోణం అతి పెద్దది. తర్వాత కేతన్ పరేఖ్ కుంభకోణం, ఆ తర్వాతా, ముందూ కూడా చిన్నా పెద్దా కుంభకోణాలు జరిగాయి. కొన్ని పత్రికలకెక్కితే, మరి కొన్నింటిని తొక్కిపెట్టారు. అమెరికా, యూరప్ లలో 2007-2009 కాలంలో మొదలైన ప్రపంచ ఆర్ధిక సంక్షోభమే ఒక పెద్ద కుంభకోణం. అనేక వందల స్పెక్యులేటివ్ కుంభకోణాల ఫలితమే “ప్రపంచ ఆర్ధిక సంక్షోభం” అనే బడా బడా…

ఎస్ & పి, అమెరికా క్రెడిట్ రేటింగ్‌ తగ్గింపు, తెలుసుకోదగిన కొన్ని అంశాలు -1

ఎస్ & పి రేటింగ్ సంస్ధ అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను ఒక మెట్టు తగ్గించింది. అమెరికా మార్కెట్లనుండి ట్రేజరీ బాండ్ల వేలం ద్వారా అప్పు సేకరించే విషయం తెలిసిందే. ఆ విధంగా అప్పు సేకరించడానికి జారీ చేసే బాండ్ల రేటింగ్‌ను ఎస్ & పి తగ్గించింది. ఇలా అప్పులకి రేటింగ్ ఉండడం ఏంటో చాలా మందికి అర్ధం కాని విషయం. ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించేవరకూ ఈ రేటింగ్‌ల విషయం పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. భారత ప్రభుత్వం…