సి.ఐ.ఎ మాజీ బాస్ గర్ల్ ఫ్రెండ్ గుప్పెట్లో లిబియా దాడి రహస్యం

సి.ఐ.ఎ మాజీ బాస్ డేవిడ్ పెట్రాస్ రాజీనామాకి దారి తీసిన రాయబారి హత్య అమెరికా ఆధిపత్య వర్గాల రాజకీయాలను కుదిపేస్తున్నది. డేవిడ్ పెట్రాస్ గర్ల్ ఫ్రెండ్ పాలా బ్రాడ్వెల్ కంప్యూటర్ లో సి.ఐ.ఎ రహస్య పత్రాలు దొరికినట్లు బ్రిటిష్ పత్రిక ఇండిపెండెంట్, అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ పత్రికలు వెల్లడించడంతో సెక్స్ కుంభకోణం విస్తృతి అమెరికా పాలకవర్గాలకు దడ పుట్టిస్తోంది. డేవిడ్ పెట్రాస్ ఆఫ్ఘన్ యుద్ధ కమాండర్ పదవి నుండి తప్పుకుని సి.ఐ.ఎ బాధ్యతలు స్వీకరించాక ఆఫ్ఘన్…

సి.ఐ.ఎ బాస్ రాజీనామాకి అక్రమ సంబంధం కారణం కాదా?

సి.ఐ.ఎ బాస్ డేవిడ్ పెట్రాస్ నవంబర్ 10 (శుక్రవారం) న అకస్మాత్తుగా రాజీనామా చేశాడు. ఒక మహిళా విలేఖరితో ఆయనకి ప్రవేట్ అఫైర్ ఉన్న విషయం ఎఫ్.బి.ఐ విచారణలో బైటికి వచ్చిందనీ, అందువల్ల జాతీయ భద్రతకు ముప్పు వచ్చే పరిస్ధితిని తప్పించడానికి పెట్రాస్ రాజీనామా చేశాడని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఆయన రాజీనామాను ఒబామా మరోమాటకు తావులేకుండా ఆమోదముద్ర వేసేశాడు. యుద్ధాల్లో పెట్రాస్ సేవలను కార్పొరేట్ పత్రికలు ఒకపక్క కొనియాడుతూనే ఆయన చేసిన పిచ్చిపని క్షమార్హం కాదని…

అమెరికా రాయబారి హత్యతో ఉనికిని చాటుకుని పురోగమిస్తున్న గడాఫీ అనుకూల ‘గ్రీన్ రెసిస్టెన్స్’ -2

లిబియా ప్రధాని తొలగింపు బెంఘాజీ దాడి తర్వాత రోజు లిబియా ప్రధానమంత్రి అబ్దుర్రహీమ్ ఎల్-కీబ్ పదవినుండి తొలగించబడ్డాడు. స్టీవెన్స్ హత్య విషయమై నాటో/అమెరికా చెప్పమన్నట్లు చెప్పకపోవడమే దానికి కారణం. స్టీవెన్స్ ను చంపింది గడాఫీ విధేయ గ్రీన్ రెసిస్టెన్సేనని మొదట లిబియా ప్రభుత్వ నేతలు ప్రకటించారు. అయితే గ్రీన్ రెసిస్టెన్స్ నీడలో లిబియా ప్రజలు ప్రతిఘటన ఇస్తున్నారన్న వాస్తవం నాటో పరువు తీస్తుంది. గడాఫీకి వ్యతిరేకంగా లిబియా ప్రజలు తిరుగుబాటు చేశారన్న పశ్చిమ దేశాల ప్రచారం అబద్ధమని…

అమెరికా రాయబారి హత్యతో ఉనికిని చాటుకుని పురోగమిస్తున్న గడాఫీ అనుకూల ‘గ్రీన్ రెసిస్టెన్స్’ -1

ప్రపంచ వాణిజ్య సంస్ధ జంట టవర్లపై దాడులు జరిగి సెప్టెంబర్ 11, 2012 తో 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. అదే రోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు లిబియాలో రెండో అతి పెద్ద పట్టణమైన బెంఘాజిలో అమెరికా రాయబారి కార్యాలయంపై విధ్వంసకర దాడులు జరిగాయి. దాడిలో అమెరికా రాయబారి క్రిస్టఫర్ స్టీవెన్స్ దుర్మణం చెందాడు. సంవత్సరం పైగా లిబియా ప్రజలపైనా, ప్రభుత్వంపైనా నాటో యుద్ధ విమానాల సాయంతో ముస్లిం టెర్రరిస్టు సంస్ధలు సాగించిన విధ్వంసకాండకీ, సామూహిక జనహననానికీ క్రిస్టఫర్…

లిబియా ఎంబసీపై దాడులు అమెరికాకి ముందే తెలుసు -ది ఇండిపెండెంట్

లిబియాలో అమెరికా రాయబారి హత్యకు దారి తీసిన ‘ఆల్-ఖైదా’ దాడుల గురించి అమెరికాకి ముందే తెలిసినా ఏమీ చేయలేదని బ్రిటన్ పత్రిక ‘ది ఇండిపెండెంట్’ వెల్లడి చేసింది. సెప్టెంబరు 11, 2012 తేదీన లిబియా నగరం బెంఘాజీ లోని అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో రాయబారి క్రిస్టఫర్ స్టీవెన్స్, మరో ముగ్గురు సిబ్బంది దుర్మరణం చెందిన సంగతి విదితమే. అమెరికా మద్దతుతో లిబియాను పాలిస్తున్న ఆల్-ఖైదా గ్రూపుల్లోని ఒక గ్రూపు అమెరికా రాయబారి హత్యకు బాధ్యురాలు.…

9/11 వార్షికోత్సవ దినాన లిబియాలో అమెరికా రాయబారి హత్య

ఫొటో: ది హిందూ న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్ల పై దాడులు జరిగి 11 సంవత్సరాలు పూర్తయిన రోజునే లిబియాలో అమెరికా రాయబారి చావును రుచి చూశాడు. అమెరికా రాయబార కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఆందోళనకారుల్లోని ముస్లిం మత ఛాందస సలాఫిస్టు గ్రూపు కార్యకర్తలు ప్రయోగించిన రాకెట్ ప్రొపెల్లర్ గ్రేనేడ్ దాడిలో రాయబారి స్టీవెన్స్ దుర్మరణం చెందాడు. పాములకి పాలు పోసి పెంచే అమెరికా దుష్ట నీతికి స్టీవెన్స్ మరణం ఒక ప్రబల సాక్ష్యం. ఒక…