జులై 5 నుండి రానున్న 5 సంవత్సరాల వరకూ క్రిస్టీన్ లాగార్డే ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్

అంతా ఊహించినట్లే ఫ్రాన్సు ఆర్ధిక మంత్రి క్రిస్టిన్ లాగార్డే ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ (International Monetary Fund) “మేనేజింగ్ డైరెక్టర్‌” గా ఏకాభిప్రాయంతో ఎంపిక చేసుకుంది. క్రిస్టిన్ లాగార్డే, ఆమె పోటీదారు అగస్టీన్ కార్‌స్టెన్స్ లకు అందిన మద్దతును, ఆమోదాలను (endorsements) సమీక్షించిన ఐ.ఎం.ఎఫ్ బోర్డు క్రిస్టిన్ లాగార్డే కి అధిక మద్దతు ఉన్నట్లు భావించి ఆమెను ఎంపిక చేసినట్లుగా ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఐ.ఎం.ఎఫ్ ఉన్నత పదవికి పోటీ ఏర్పడింది. ఎమర్జింగ్ మార్కెట్…

ఐ.ఎం.ఎఫ్ ఉపాధ్యక్ష పదవికోసం బ్రిక్స్ కూటమి తీర్మానానికి పాతరేసిన చైనా

బ్రిక్స్ నిర్ణయానికి పాతరేస్తూ చైనా ఫ్రాన్సు అభ్యర్ధి క్రిస్టిన్ లాగార్డేకి ఐ.ఎం.ఎఫ్ అధ్యక్షురాలుగా ఉండడానికి మద్దతు ప్రకటించింది. బ్రిక్స్ (BRICS) అనేది ఐదు లీడింగ్ ఎమర్జింగ్ దేశాల కూటమి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా లు ఇందులో సభ్య దేశాలు. ఐ.ఎం.ఎఫ్ అధ్యక్ష పదవి ఖాళీ అయ్యాక యూరప్ దేశాలు యూరప్ అభ్యర్ధిని ఆ పదవిలో నియమించాలని కోరింది. యూరప్ అప్పు సంక్షోభం ఎదుర్కొంటున్నందున అది న్యాయమని చెప్పింది. ఆత్రుతగా ఫ్రాన్సు ఆర్ధిమ మంత్రి…