అత్యాచారాలు: సి.బి.ఐ బాస్ కువ్యాఖ్యలు, ఆనక సారీ

శుభం పలకరా పెళ్లికొడుకా అంటే ఇంకేదో అన్నాట్ట వెనకటికొకరు. క్రికెట్ బెట్టింగ్ అరికట్టడం గురించి చర్చలో పాల్గొనమని పిలిస్తే మహిళలపై జరుగుతున్న లైంగిక అత్యాచారాల గురించి అసంబద్ధంగా మాట్లాడి విమర్శల పాలయ్యారు సి.బి.ఐ బాస్ రంజిత్ సిన్హా! లైంగిక అత్యాచారాలను ఆయన జూదంతో పోల్చారు. జూదం అరికట్టలేని పరిస్ధితుల్లో బెట్టింగ్ లాంటి జూదాలను చట్టబద్ధం చేయడమే మంచిదని సలహా ఇచ్చేశారు. ‘అరికట్టలేని బెట్టింగ్ లను చట్టబద్ధం చేయాలన్న సలహాలాగే అత్యాచారాన్ని నివారించలేకపోతే ఎంజాయ్ చేయడమే బెటర్ అని…