రాజీనామా చేయమని జైట్లీకి మోడి సంకేతం?!

ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ -డి‌డి‌సి‌ఏ- అధ్యక్షులుగా 13 సంవత్సరాలు, ప్యాట్రన్-ఇన్-చీఫ్ గా ఒక సంవత్సరం పదవులు నిర్వహించిన ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, అవినీతి ఆరోపణల నేపధ్యంలో, రాజీనామా చేయవలసి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడి సంకేతం ఇచ్చారా? బి.జె.పి పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో నరేంద్ర మోడి చేశారంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పత్రికలకు చెప్పిన వ్యాఖ్యలు ఈ అనుమానాన్ని కలిగిస్తున్నాయి. “ప్రధాన మంత్రి ఎల్.కె.అద్వానీ ఉదాహరణను ప్రస్తావించారు. అప్పటి ప్రభుత్వం…